Lady Aghori: గత కొంత కాలం నుండి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న అంశాలలో ఒకటి లేడీ అఘోరీ. రీసెంట్ గానే ఈమెని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పోలీసులు రిమాండ్ లోకి తీసుకొని ఈ అఘోరీ ని విచారించగా, సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. లేడీ అఘోరీగా తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలం నుండి రేపుతున్న ఈ వ్యక్తి స్త్రీ కాదు, మగాడు అని రిమాండ్ రిపోర్ట్ లో తేలింది. తనకు తాంత్రిక శక్తులు ఉన్నాయని చెప్పి, ఎన్నో జిమ్మిక్కులు చేసి ఇతగాడు వేసిన వేషాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి. అఘోరీ గా ఇన్ని రోజులు డ్రామాలు వేసి జనాలను మోసం చేసిన ఇతగాడి పేరు శ్రీనివాస్. ఇతను ఆదిలాబాద్ కి చెందిన వ్యక్తి. మోకిలా పోలీస్ స్టేషన్ లో ఈ దుర్మార్గుడిపై ఒక స్త్రీ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి, ఇతని కోసం గాలించి, ఎట్టకేలకు కస్టడీ లోకి తీసుకున్నారు.
Also Read: ‘రెట్రో’ సినిమా ఛాన్స్ ని తప్పించుకున్న తెలుగు హీరో అతనేనా..? అదృష్టవంతుడు!
తనకు తాంత్రిక పూజలు చేస్తానని, నగ్న పూజలు చేస్తానని చెప్పి, పది లక్షల రూపాయిలను కాజేసాడట. ఇకపోతే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరీగా ప్రాచుర్యం చెందిన రోజుల్లో, తన పురుషాంగాన్ని పరమ శివుడికి అర్పించానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ రిమాండ్ రిపోర్ట్ లో అసలు నిజం తేలింది. శ్రీనివాస్ చిన్నతనం నుండి తన గ్రామం లో దొంగతనాలు చేస్తూ ఉండేవాడట. ఎన్నో సార్లు గ్రామస్తులు ఇతనికి బుద్ధి చెప్పినా మారలేదు. ఒకరోజు ఇతను చేసిన పనులకు గ్రామస్తులు వేసిన శిక్షలో జననేంద్రియాలు కాలిపోయాయట. ఆ తర్వాత తీవ్రమైన ఇన్ఫెక్షన్ రావడంతో పురుషాంగంలోని కొంత భాగాన్ని డాక్టర్లు తొలగించారట. అప్పుడు శ్రీనివాస్ చెన్నై కి వెళ్లి 2023 వ సంవత్సరం లో తన పురుషాంగాన్ని పూర్తిగా తొలగించుకున్నాడట.
ఆ తర్వాత 2024 వ సంవత్సరం లో వృషణాలు కూడా తొలగించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇతగాడు అఘోరీలా మారితే బాగా పాపులర్ అయ్యి లక్షల రూపాయిలు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో స్త్రీ లక్షణాలు వచ్చే హార్మోన్ థెరఫీ కూడా చేయించుకున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత స్త్రీ లక్షణాలతో జుట్టు పెంచుకొని, ఆచం స్త్రీ లాగా మారిపోయిన శ్రీనివాస్ భక్తుల నుండి డబ్బులు, కానుకలు డిమాండ్ చేసేవాడని, ఇవ్వకపోతే తాంత్రిక శక్తులతో వాళ్ళని అంతం చేస్తానని బెదిరించేవాడని పోలీసులు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా శ్రీనివాస్ స్వయంగా తాను ట్రాన్స్ జెండర్ కాదని రిమాండ్ రిపోర్ట్ లో చెప్పాడట. ఇలా అఘోరీగా మారి జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించడమే ద్యేయంగా ముందుకెళ్లిన శ్రీనివాస్ నిజస్వరూపాన్ని తెలుసుకున్న నెటిజెన్స్, ఇలాంటోళ్లను తీవ్రంగా శిక్షించాలని, వీళ్ళని చూసి ఇంకొకరు తయారు అవ్వకుండా ఉండే రేంజ్ లో ఆ శిక్షలు ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.