AP GOvernment: ఈ క్రమంలో పశువుల పెంపకం దారులకు పోరాట కలిగిస్తూ ఏపీ ప్రభుత్వం 50% రాయితీలపై పశువుల దాన పంపిణీ చేయమని ఆంధ్ర ప్రదేశ్ పశుసంవర్ధక శాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఈ క్రమంలో 50 కేజీల బస్తాను రూ.1100 కు కొనుగోలు చేసి వాటిని రైతులకు కేవలం రూ.555 కు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రయోజనం పొందడానికి రైతులు మరియు పశువుల పెంపకం దారులు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పశువుల పెంపకం దారులకు ఒక మంచి శుభవార్తను తెలిపింది. ఎండాకాలంలో పశువులకు పచ్చగడ్డి దొరకడం పశువుల పెంపకం దారులకు చాలా కష్టంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పశువులకు సరైన పోషణ అందక పాల దిగుబడి పై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.
Also Read: ‘అఘోరీ’ మగాడే..రిమాండ్ రిపోర్ట్ లో వణుకుపుట్టిస్తున్న సంచలన నిజాలు!
దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పశువుల పెంపకం దారులకు ఉపయోగపడేలాగా ఒక కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రభుత్వం రైతులకు, పశువుల పెంపకం దారులకు 50 శాతం రాయితీతో దాన అందించాలని నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ రైతులకు మరియు పశువుల పెంపకం దారులకు 20 శాతం ప్రోటీన్ తో ఉన్న బలవర్ధకమైన దానాలు కేవలం 50% రాయితీతో అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 50 కేజీలు ఉన్న పశువుల దాన బస్తాను రూ.1100 కు కొనుగోలు చేసి దానిని రైతులకు కేవలం రూ.555 కు అందించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
50% రాయితీ కల్పించడం ద్వారా ప్రభుత్వం మీద ఆర్థికంగా భారం పడినప్పటికీ కూడా ఈ వేసవి కాలంలో పశువుల కోసం పశుగ్రాసం కొరతను అధికమించి పాల దిగుబడి తగ్గకుండా చూసుకునే లాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 21 లక్షల మంది పశువుల పెంపకదారులకు చాలా ప్రయోజనం కలగనుంది. రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువుల పెంపకం మరియు కోళ్ల పెంపకం వంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. ఈ వేసవి కాలంలో రైతులు పశుగ్రాసం దొరక్క ఇబ్బంది పడతారని ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం 50% రాయితీతో పశువుల దాన రైతులకు అందించాలని పశుసంవర్ధక శాఖ నిర్ణయం తీసుకుంది.