Telugu Top Media Owner: తండ్రి చేసిన పాపం.. ఆ మీడియా అధినేత కుమారుడికి శాపమైందా?

ఇది కథే కావచ్చు. కానీ ప్రస్తుత వర్తమాన పరిస్థితులకు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. మీడియా సర్కిల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. మీడియా అధిపతి కుమారుడు ప్రస్తుతం తీవ్రమైన మధుమేహంతో బాధపడుతున్నాడు. అతడి వయసు గట్టిగా 40 ఏళ్ళు కూడా ఉండవు.

Written By: NARESH, Updated On : September 8, 2023 2:22 pm

Telugu Media

Follow us on

Telugu Top Media Owner: వెనుకటి రోజుల్లో తాతలు చేసిన పాపాలు మనవళ్లకు తగిలేవి. కొంతకాలానికి ఈ పరిస్థితి మారింది. ఇప్పుడు తండ్రులు చేసిన పాపాలను పిల్లలు అనుభవించాల్సి వస్తోంది.. అంటే మనిషిలో తప్పు తీవ్రత పెరుగుతున్నా కొద్దీ పడే శిక్ష లేదా తగిలే పాపం అనేది వేగంగా ఉంటున్నది. వెనుకటికి ఒక మహారాజు వేటకు వెళుతూ కడుపుతో ఉన్న సింహాన్ని చంపాడు. రాజుగారు వేసిన బాణం దెబ్బకు సింహం పొట్ట నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. భటులు చూసి సింహం చనిపోయిందని రాజుకు చెప్పారు. సింహాన్ని చంపిన వీరాదేశంలో రాజు మీసం మెలేశాడు. ఆ ఆనందంలో సింహం చర్మాన్ని వలచి తాను చెప్పులుగా కుట్టించుకుంటానని.. ఆ విషయాన్ని భటులకు చెప్పాడు. ఆ తర్వాత భటులు కూడా తు.చా తప్పకుండా పాటించారు. చర్మాన్ని వలుస్తున్నప్పుడు సింహం కడుపులో నుంచి చిన్న పిల్ల బయటకు వచ్చింది. అది చూసి భటుల మనసు కరిగిపోయింది. కానీ రాజు లో కించిత్ పాప భీతి కూడా లేదు. ఆ కొంతకాలానికి ఒక బాబుకు జన్మనిచ్చిన తన భార్య.. రెండవ కాన్పులో ఉన్నప్పుడు అర్ధాంతరంగా కన్నుమూసింది. సతి వియోగంతో చాలా రోజులపాటు రాజు బయటికి రాలేదు. ఉన్న ఒక్క కొడుకు కూడా అవిటివాడయ్యాడు.. ఆ బాధతో రాజు కూడా కన్నుమూశాడు. శత్రుదేశాల వారు దండెత్తడంతో ఆ రాజు సంస్థానం వేరే వాళ్ళ వశమైంది.

ఇది కథే కావచ్చు. కానీ ప్రస్తుత వర్తమాన పరిస్థితులకు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. మీడియా సర్కిల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. మీడియా అధిపతి కుమారుడు ప్రస్తుతం తీవ్రమైన మధుమేహంతో బాధపడుతున్నాడు. అతడి వయసు గట్టిగా 40 ఏళ్ళు కూడా ఉండవు. అతడికి ఉన్న మధుమేహం మాత్రం 300 దాటింది. ఆరోగ్యం విషమంగా ఉండడంతో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాధారణంగా ఇలాంటి విషయాలు చెబుతున్నప్పుడు మానవత్వం అనేది ఉండాలి అంటారు పెద్దలు. ఎదుటివారి అనారోగ్యాన్ని కూడా శత్రుకోణంలో చూడకూడదని హితవు పలుకుతుంటారు. కానీ ఆ మీడియా అధిపతి ఇతరుల జీవితాల్లోకి తొంగి చూశాడు. వ్యక్తిగత జీవితాలను కూడా పేపర్ లోకి లాగాడు.. వివాహేతర సంబంధాలు అంటగట్టాడు. రహస్య కెమెరాలు అమర్చి వ్యక్తిగత జీవితాలను బజారుపాలు చేశాడు.. అలాంటి వ్యక్తికి ఇలా జరగడం మంచిదే కదా అనే అభిప్రాయం ఇప్పుడు చాలామందిలో కలుగుతుంది అంటే.. దానికి కారణం అతడే కదా. చెరపకురా చెడేవు అనే సామెత కూడా ఊరకనే పుట్టలేదు కదా..

అన్నట్టు ఆ మీడియా అధిపతి కుటుంబంలో రెండేళ్ల క్రితం తీవ్రమైన విషాదం చోటుచేసుకుంది.. ఆ బాధ నుంచి ఆయన త్వరగానే బయటపడ్డాడు. కానీ ఈ లోగానే అతని కుమారుడు తీవ్రమైన మధుమేహం బారిన పడ్డాడు. గత 15 రోజుల నుంచి అతడు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. కోవిడ్ సమయంలో తన సంస్థలో పనిచేసే ఎంతోమంది ఉద్యోగులు కనుమూసినప్పటికీ ఆ యజమాని పట్టించుకోలేదు.. కనీసం నివాళి కూడా అర్పించలేదు. తన పత్రికలో సింగిల్ కాలం వార్త కూడా ప్రచురించేందుకు ఒప్పుకోలేదు. ఉదయం లేస్తే భారతీయ జనతా పార్టీ మీద విరుచుకుపడి వార్తలు ప్రచురించేవాడు. కాని చివరికి ఆ భారతీయ జనతా పార్టీ ద్వారా ఎన్నికై ప్రధాన మంత్రిగా పాలిస్తున్న వ్యక్తి తీసుకువచ్చిన పథకమే ఆ మీడియా అధిపతి సంస్థలో పనిచేసే ఉద్యోగుల పాలిట ఆసరా అయింది.. కోవిడ్ తో కన్ను మూసిన మీడియా అధిపతి సంస్థల పని చేసే ఉద్యోగుల కుటుంబాలకు కల్పతరువుగా మారింది. ఆ పది లక్షలు గనుక కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయి ఉంటే వారి కుటుంబాలు మరింత దీనస్థితిలోకి వెళ్లేవి. వెల్ఫేర్ ఫండ్ ను ఉద్యోగుల జీతాల నుంచి వసూలు చేసే ఆ మీడియా అధిపతి.. ఇంతవరకు ఒక్కరికి కూడా రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. విధి నిర్వహణలో కన్నుమూసిన విలేకరులకు నయా పైసా ఇచ్చిన రుజువులు లేవు.. ఎంతసేపటికి ఉద్యోగులను పీడించడమే అతని నైజం. అతని కుటుంబం అంతకంతకూ అనుభవిస్తోంది. ఈ మాట చెప్పేందుకు మానవత్వం అడ్డువస్తున్నప్పటికీ.. పంటి కింద బాధ అనుభవించిన వాడికే అర్థమవుతుంది ఆ వేదన గాడత ఎంతో..