Homeక్రీడలుArgentina vs Spain : ఫైనల్ కు ముందు అర్జెంటీనాలో కలవరం.. కారణమేంటంటే..

Argentina vs Spain : ఫైనల్ కు ముందు అర్జెంటీనాలో కలవరం.. కారణమేంటంటే..

Argentina vs Spain : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో మొదలు కాబోతోంది. ట్రోఫీ కోసం అర్జెంటీనా.. స్పెయిన్ జట్లు పోటీ పడబోతున్నాయి. వరుసగా రెండోసారీ ఫైనల్లో ప్రవేశించిన అర్జెంటీనా జట్టు.. ట్రోఫీని అందుకొని రికార్డు సృష్టించాలని భావిస్తోంది. మరోవైపు 2010లో తొలిసారి విజేతగా ఆవిర్భవించిన స్పెయిన్.. మరోసారి ఆ మ్యాజిక్ ప్రదర్శించాలని భావిస్తోంది. ఇటీవల యూరోపియన్ ట్రోఫీ విజేతగా నిలిచింది స్పెయిన్.

ఈ రెండు జట్లు కూడా ఫైనల్ దాకా రావడం అత్యంత ప్రత్యేకం. ఈ టోర్నీలో అర్జెంటీనా టైటిల్ ఫేవరెట్ గా రంగంలోకి దిగినప్పటికీ పడుతూ లేస్తూ తన ప్రస్తానాన్ని ప్రారంభించింది. కీలక సమయంలో మాత్రం సత్తా చూపించింది. అద్భుతమైన విజయాలు సాధించి ఫైనల్ దాకా వచ్చింది. స్పెయిన్ మాత్రం స్థిరమైన ఆట తీరు కొనసాగించింది. ఒక ప్లేయర్ మీద మాత్రమే నమ్మకం పెట్టుకోకుండా.. అందరి ప్లేయర్ల ప్రదర్శనతో ఫైనల్ దాకా వచ్చింది. స్ప్రేంజట్టులో యువకులు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా డిఫెన్స్ విభాగంలో స్పెయిన్ జట్టుకు తిరుగులేదు. దీనిని ఛేదించడం ప్రత్యర్థి జట్ల వల్ల అసలు కావడం లేదు. స్పెయిన్ జట్టుకు గోల్ కీపర్ గా సమైన్ వ్యవహరిస్తున్నాడు. అతడు పెట్టని కోట మాదిరిగా ఉన్నాడు. స్పెయిన్ జట్టు మీద క్వార్టర్ ఫైనల్ లో బెల్జియం మినహా ఏ జట్టు కూడా గోల్ సాధించలేకపోయింది. గ్రూప్ దశలో స్పెయిన్ జట్టు స్థిరమైన ఆట తీరు కొనసాగించింది. నాకౌట్ టోర్నీలో మాత్రం పెద్ద పెద్ద జట్లకు చుక్కలు చూపించింది. బెల్జియం , ప్రాన్స్ జట్ల మీద గెలిచి తన మీద అంచనాలను మరింత పెంచుకుంది.

స్పెయిన్ జట్టుతో పోల్చి చూస్తే అర్జెంటినాకు ఘనమైన చరిత్ర ఉంది. ఈ జట్టు 1978, 1986, 2022 సంవత్సరాలలో విజేతగా నిలిచింది. మొత్తంగా ఆరుసార్లు ఫైనల్ దాకా వచ్చింది అర్జెంటీనా. మూడుసార్లు ఫైనల్లో ఓడిపోయింది.. 1930, 1990, 2014 సంవత్సరాలలో ఫైనల్ మ్యాచ్లలో అర్జెంటీనా ఓటమిపాలైంది. మూడుసార్లు ఫైనల్లో ఓడిపోవడం.. ఫైనల్ మ్యాచ్ అనగానే అర్జెంటీనా ఆటగాళ్లు ఒత్తిడిలో కూరుకుపోవడం సర్వసాధారణం. అయితే గతంలో మూడుసార్లు ఫైనల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఈసారి ఏం జరుగుతుందోనని అభిమానులు ఆందోళనలో ఉన్నారు. అర్జెంటీనా జట్టు ఆట తీరు స్థిరంగా లేకపోవడం.. స్పెయిన్ జట్టు డిఫెన్స్ బలంగా ఉండడంతో.. అర్జెంటీనా అభిమానులు కలవర పడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version