FIFA World Cup Final : ఫిఫా ప్రపంచ కప్..అందులోనూ అర్జెంటీనా ఫైనల్ వెళ్లింది. పోటీ పడేది స్పెయిన్ తో..దీంతో అభిమానుల అంచనాలు తారా స్థాయికి చేరాయి. రెండోసారి వరుసగా ఫైనల్ చేరుకున్న అర్జెంటీనా కప్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. స్పెయిన్ కూడా ఇప్పటి వరకూ స్థిరమైన ప్రదర్శన చేసింది. ఫైనల్ మ్యాచ్ లో కూడా సత్తా చూపించి, అర్జెంటీనాకు షాక్ ఇవ్వాలని చూస్తోంది.
16 సంవత్సరాల తర్వాత స్పెయిన్ ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ పోటీలో అడుగుపెట్టింది. ట్రోఫీ అందుకోవాలని స్పెయిన్ జట్టు బలమైన నిర్ణయంతో ఉంది. రెండు జట్లలో కూడా కొదమసింహా లాంటి ప్లేయర్లు ఉన్నారు. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఫుట్ బాల్ టోర్నీలో సూపర్ ఆట తీరు ప్రదర్శించాయి. ఈ క్రమంలో ఫైనల్ పోటీకి తగ్గట్టుగానే.. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులను నిలువు దోపిడీ చేయడం మొదలైంది.
ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తూ.. చేతిలో చికెన్ నగ్గెట్స్.. చల్లటి బీరు తాగుతూ ఎంజాయ్ చేయడం చాలామందికి ఒక సరదా. అయితే ఈ సరదా ను ఈసారి మరింత కాస్ట్లీ గా మార్చారు. ఎందుకంటే ఫిఫా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఒక్కో టికెట్ ధర ఏకంగా 27 లక్షల ను ఖరారు చేశారు. ఫిఫా వరల్డ్ కప్ కు దాదాపు 96 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇన్ని సంవత్సరాలలో ఎన్నడూ కూడా ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో ఇంత స్థాయిలో టికెట్ ధర ప్రకటించలేదు.
ఫైనల్ మ్యాచ్లో అత్యున్నత హాస్పిటాలిటీ టికెట్ ధర ఏకంగా 27 లక్షలు పలికింది.. అయితే ఇందులో కేవలం మ్యాచ్ వీక్షణ మాత్రమే కాకుండా.. అత్యున్నత స్థాయిలో లాంజ్.. ఫైవ్ స్టార్ రేంజ్ లో డైనింగ్.. ఇంకా అనేక రకాల లగ్జరీ సేవలు ఇందులో ఉంటాయి. అయితే విఐపి కేటగిరి వాళ్లకు మాత్రమే ఈ స్థాయిలో టికెట్ ధరలు కేటాయించాలని.. సామాన్య ప్రేక్షకులకు ధరలు తగగానే ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు.
2024 లో సూపర్ బౌల్ ఛాంపియన్షిప్ లో శాన్ ఫ్రాన్సిస్కో 49ఈఆర్ఎస్ వర్సెస్ కాన్సాస్ సిటీ మధ్య జరిగిన పోటీ అత్యంత ఖరీదైన మ్యాచ్ గా నిలిచింది. అప్పట్లో టికెట్ ధర 9.6 లక్షలు గా నమోదయింది. ఇప్పుడు ఫిఫా ఫైనల్ టోర్నీలో ఆ రికార్డు దాదాపుగా బద్దలైపోయింది. టికెట్ ధర ఏకంగా మూడు రెట్లు పెరిగిపోయింది. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో అత్యంత కనిష్ట టికెట్ ధర 6 లక్షలు గా నమోదయింది. ఇందులో యావరేజ్ టికెట్ ధర 10 లక్షలు గా ఉండడం విశేషం. అర్జెంటీనా.. ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో సమీఫైనల్ మ్యాచ్ టికెట్ కనిష్ట ధర 6.39 లక్షలు గా ఉంది. సెమి ఫైనల్ మ్యాచ్ తో పోల్చి చూస్తే ఫైనల్ మ్యాచ్ టికెట్ తక్కువ ధర 93000 పలకడం విశేషం.. గతంలో ఎన్నడు లేనంతగా ఈసారి ఫిఫా వరల్డ్ కప్ కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ పోటీలను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు రావడం విశేషం.
