HomeతెలంగాణRythu Bharosa eligibility: ఇలా చేసిన వారికే రైతు భరోసా.. ఏఈవోలను సంప్రదించండి!

Rythu Bharosa eligibility: ఇలా చేసిన వారికే రైతు భరోసా.. ఏఈవోలను సంప్రదించండి!

Rythu Bharosa eligibility: తెలంగాణ ప్రభుత్వం యాసంగి సాగుకు సంబంధించి రైతు భరోసా డబ్బులను చెల్లించేందుకు ఎట్టకేలకు సిద్ధమైంది. సీజన్‌ ముగింపు దశకు వచ్చింది. మూడు నెలలుగా రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. విపక్షాలు ప్రభుత్వం తీరుపై మండిపడ్డాయి. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.9 వేల కోట్ల రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. తొలి విడత మార్చి 22న విడుదల చేస్తుంది. కొత్తగా పట్టాపాస్‌బుక్‌ పొందిన రైతులు ఇలా చేస్తేనే పెట్టుబడి పొందుతారు.

పథకం వివరాలు
రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ.6 వేల పెట్టుబడి సాయం అందిస్తుంది. మొత్తం రూ.9 వేల కోట్లు మూడు విడతల్లో 1.50 కోట్ల ఎకరాలకు జమ చేస్తారు. మొదటి దశలో 70 లక్షల మందికి రూ.3,590 కోట్లు జమ చేస్తారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్‌రెడ్డి దీనిని ప్రారంభిస్తారు.

అర్హులు వీరే..
2026 ఫిబ్రవరి 28 వరకు పట్టా పాస్‌బుక్‌ ఉన్న రైతులే భరోసాకు అర్హులు. గత జూన్‌ తర్వాత భూములు కొనుగోలు చేసి పట్టా బుక్‌ పొందినవారు ఈ సీజన్‌ సాయానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే పొందుతున్నవారికి అదనపు అవసరం లేదు. అసైన్డ్‌ భూములు, ధరణి పోర్టల్‌ సర్దుబాట్లు పరిగణనలోకి తీసుకుంటారు.

దరఖాస్తు విధానం
పాస్‌బుక్, ఆధార్, బ్యాంకు వివరాలతో వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి ఫారమ్‌ పూర్తి చేయాలి. అధికారులు ధ్రువీకరించి అర్హుల జాబితా ఖరారు చేస్తారు. ఆధార్‌ లింక్‌ ఖాతాలకు నేరుగా డీబీటీ ద్వారా సాయం అందుంతి. కొత్త పాస్‌బుక్‌ పొందినవారు వెంటనే దరఖాస్తు చేయాలి. అక్రమ పాస్‌బుక్‌లతో మోసాలు జరిగే అవకాశం ఉంది. స్థానిక అధికారులను మాత్రమే సంప్రదించి ధ్రువీకరణ పొందాలి.

వ్యవసాయ పనుల సమయంలో ఈ సాయం రైతుల పెట్టుబడి తగ్గిస్తుంది. ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో 70 లక్షల మందికి ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version