BJP Party
BJP Party : బిజెపిలో( Bhartiya Janata Party) టిడిపి వ్యతిరేకులు అన్న ముద్ర చాలామంది నేతలపై ఉంది. అటువంటి వారిలో ముందు వరుసలో ఉంటారు సోము వీర్రాజు, జివిఎల్ నరసింహం, విష్ణువర్ధన్ రెడ్డి. ఈ ముగ్గురు నేతలు తెలుగుదేశం పార్టీకి ఓ రేంజ్ లో చుక్కలు చూపించారు. గత ఐదేళ్లలో టిడిపి విధానాలను వ్యతిరేకించారు. తెలుగుదేశం బిజెపికి పొత్తు ఉండకూడదు విశ్వసించారు. అందుకోసం చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ముందుకొచ్చింది బిజెపి. అయితే అప్పటివరకు టిడిపిని వ్యతిరేకించారు కనుక వారికి సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు దక్కలేదు. టిడిపి తో పొత్తు కు సానుకూలంగా వ్యవహరించిన బిజెపి నేతలకు మాత్రమే టికెట్లు దక్కాయి.
Also Read : రాజ్యసభకు కూటమి అభ్యర్థి ఫిక్స్.. ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్!
* నామినేటెడ్ పోస్టుల్లో మొండి చేయి..
కూటమి (alliance) అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. సోము వీర్రాజు పేరు కానీ.. విష్ణువర్ధన్ రెడ్డి పేరు కానీ.. జివిఎల్ నరసింహం పేరు ఎక్కడ వినిపించలేదు. కానీ ఉన్నట్టుండి సోము వీర్రాజు పేరును ఎమ్మెల్సీగా ప్రకటించారు. అయితే ఇది ఎలా సాధ్యం అన్న టాక్ ప్రారంభం అయ్యింది. తనకున్న పలుకుబడితో కేంద్ర పెద్దలతో చెప్పించేసరికి చంద్రబాబు ఒప్పుకున్నారు. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీంతో మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఒకటి వారు కేంద్ర పెద్దలతో చెప్పించుకోవాలి. లేకుంటే చంద్రబాబుతో రాజీ చేసుకోవాలి.
* జివిఎల్ కు ఛాన్స్..
తాజాగా రాజ్యసభ పదవిని జీవీఎల్ నరసింహానికి( gvl Narasimham ) ఇస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఈయన బిజెపి తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉండేవారు. అయితే ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే విశాఖ పార్లమెంట్ స్థానంపై దృష్టి పెట్టారు. పొత్తులో భాగంగా విశాఖ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ ఆ సీటు వదులుకునేందుకు చంద్రబాబు ఇష్టపడలేదు. దానికి బదులు అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని బిజెపికి ఇచ్చారు. అలాగని జివిఎల్ అభ్యర్థిత్వాన్ని సైతం చంద్రబాబు వ్యతిరేకించారు. దీంతో జివిఎల్ కు ఎక్కడ సీటు దక్కలేదు. విష్ణువర్ధన్ రెడ్డి ది అదే పరిస్థితి. టిడిపికి వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా ఈయన వ్యవహరించారన్నది ప్రధాన ఆరోపణ.
* ఆ ఇద్దరు సైతం రాజీ
అయితే సోము వీర్రాజు పై ( Somveer Raju )కూడా వైసిపి అనుకూల ముద్ర ఉండేది. ఆ కారణంతోనే ఆయనకు మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. అయితే ఈ విషయంలో సోము వీర్రాజు చంద్రబాబుతో రాజీ పడడం వల్లే ఆయనకు చివరి నిమిషంలో ఎమ్మెల్సీ పదవి దక్కినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ మిగతా ఇద్దరు నేతలు సైతం చంద్రబాబుతో రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.
Also Read : ఆ మాజీ సీఎంకు కలిసి రాని కాలం!