Goat meat seizure
Hyderabad : ఆదివారం వచ్చిందంటే చాలు చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. మాంసాహారులకు ఇష్టమైన చికెన్, మటన్, చేపలు వీటిలో ఏదో ఒకటి ఆ రోజు ఇంట్లో ఉడకాల్సిందే. ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులు ఉదయం నుంచే ఆ దుకాణాలు ముందు బారులుదీరుతుంటారు. కొన్ని చోట్ల అయితే పొడవాటి క్యూలు దర్శనం ఇస్తుంటాయి. ఇటీవల బర్డ్ ఫ్లూ భయం ఎక్కువగా ఉండడంతో చాలా మంది చికెన్ కు బదులు మేక మాంసం కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనిని సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు కనీస ప్రమాణాలు పాటించకుండానే మాంసం విక్రయిస్తున్నారు. అసలు ఆ జీవాలు సురక్షితమేనా.. పోనీ కోసిన మటన్ అన్నా ఫ్రెష్ దేనా అన్నది వినియోగదారులు ఓ సారి పరిశీలించాలి.
మాంసాహారులకు ఇష్టమైన చికెన్, మటన్లను కల్తీ చేస్తూ కొంతమంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి వారి షాపులపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిబంధనలు పాటించని షాపులను అధికారులు సీజ్ చేస్తున్నారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లైసెన్స్ లేకుండా మాంసం దుకాణాలు నిర్వహిస్తున్న వాటిని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల బృందం కొన్ని చోట్లు భారీ ఎత్తున మాంసాన్ని పట్టుకుని సీజ్ చేశారు.
బర్డ్‌ఫ్లూ భయం పెరిగిపోవడంతో ప్రజలు జీవాలు, చేపల మీద ఆసక్తి చూపిస్తున్నారు. అదే అదునుగా కొందరు రూల్స్ అతిక్రమించి విక్రయాలు చేస్తున్నారు. కిలోకు ఏకంగా ధర రూ.100-200 పెంచేశారు. ఎక్కడో కోసి నగరానికి తీసుకొచ్చి దుకాణాల్లో విక్రయిస్తున్నారు.అసలు అవి బతికి ఉన్నాయా.. లేక చనిపోయిన వాటిని తెచ్చి అమ్ముతున్నారా అన్న విషయం కూడా గోప్యమే.
హైదరాబాద్ మంగళహాట్ చిస్తీ చమాన్ లో ఓ మేక మాంసం దుకాణం పై బుధవారం సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ సర్కిల్ 14 ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి మహమ్మద్ అఫ్రోజ్ (40)అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద పాయ, తలకాయ, బ్రెయిన్, కిడ్నీ, మేక గొర్రె లివర్ సుమారు 12 టన్నుల బీఫ్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.8లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అఫ్రోజ్ చెడిపోయిన మేక గొర్రెల మాంసాన్ని చిస్తీ చమాన్ లోని దుకాణం లో ఫ్రిజ్ లో నిల్వ చేసి తక్కువ ధరకే హోటళ్లు, శుభకార్యాలకు సప్లై చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read : తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రా సంగీత దర్శకుడా.. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత అసంతృప్తి.