Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్. గడిచిన పదేళ్లుగా గణనీయమైన అభివృద్ధి సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రభుత్వాలు హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక అభివృద్ధి పనులు చేపట్టాయి. తెలంగాణ విభజన తర్వాత మరింత అభివృద్ధి చెందింది. తాజాగా కాంగ్రెస్ కూడా ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
విశ్వనంగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్.. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కాబోతోంది. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆక్రమణలను తొలగించడంతోపాటు నగరాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. నలుదిశలా అభివృద్ధి జరిగేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. జిల్లాలో ఉపాధి లేనివారు హైదరాబాద్‌కు వచ్చి ఉపాధి పొందుతున్నారు. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా కార్మికులు వచ్చి హైదరాబాద్‌లో పనులు చేస్తున్నారు. వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో నివాసాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో నిర్మాణరంగం వేగంగా విస్తరిస్తోంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరినీ దృష్టిలో పెట్టుకుని బిల్డర్స్ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో హైదరాబాద్ ఇపుపడు ఆకాశ హర్మ్యాలకు నిలయంగా మారుతోంది.
పెరుగుతున్న అపార్ట్‌మెంట్లు..
హైదరాబాద్‌లో అత్యంత లగ్జరీ నివాస ప్రాంతంగా మారుతున్న కోకాపేటలో హైరైజ్ అపార్టుమెంట్లు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో అతి ఎత్తయిన అపార్టుమెంట్ గా నిర్మాణం అవుతోంది ఎస్‌ఏఎస్ క్రౌన్ కోకాపేట గోల్డెన్ మైల్ రోడ్‌లో నిర్మాణం అవుతున్న ఈ అపార్టుమెంట్ లగ్జరీకి మరో పేరుగా నిలుస్తోంది. నాలుగున్నర ఎకరాల్లో ఐదు టవర్లు నిర్మిస్తున్నారు. మొత్తం అరవై అంతస్తుల నిర్మాణం. ఐదు టవర్లు అరవై అంతస్తులు అయినప్పటికీ .. యూనిట్స్ చాలా తక్కువ. ఎందుకంటే ఇవి అత్యంత స్పేసియస్ అపార్టుమెంట్లు. కనీసం ఓ ఆపార్టుమెంట్ 6,565 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. అంటే సాధారణ టూ బెడ్ రూం అపార్టుమెంట్లు వెయ్యి ఎస్‌ఎఫ్టీ అయితే.. ఏడు అపార్టుమెంట్లు కలిస్తే ఒకటన్నమాట. అతి పెద్దది 8,811 ఎస్‌ఎఫ్‌టీ ఉంటుంది.
అంతర్జాతీయ అర్కిటెక్చరల్స్ డిజైన్లతో..
అంతర్జాతీయస్థాయి ఆర్కిటెక్చరల్ డిజైన్లతో ఎస్‌ఏఎస్ క్రౌన్ నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే అత్యధిక ఫ్లాట్లు బుక్ అయినట్లుగా తెలుస్తోంది. కోకాపేట వైపు నుంచి ఔటర్ రింగ్ రోడ్ వైపు వెళ్తూంటే.. ఈ అరవై అంతస్తుల నిర్మాణం కనిపిస్తుంది. 50 అంతస్తుల పైన నివాసం ఉంటే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. ఈ అపార్టుమెంట్ కాంప్లెక్స్ ప్రారంభించి బుకింగ్స్ ప్రారంభించినప్పుడు ఐదు నుంచి ఏడు కోట్ల వరకూ ఒక్కో ఫ్లాట్‌ను బుక్ చేసుకున్నారు. ఇప్పుడు అది ఎనిమిది నుంచి పది కోట్లకు చేరిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Hyderabad 60 storey apartments in hyderabad what is the price of each one in kokapet
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com