CM Revanth Reddy (8)
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో సోషల్ మీడియా దుర్వినియోగంపై తీవ్రంగా స్పందించారు. తనను తిడుతూ వీడియోలు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “నన్ను తిడుతూ వీడియోలు పెట్టినోళ్లను తోడుకల్ తీస్తా, బట్టలిప్పదీసి రోడ్డు మీద తిప్పిస్తా” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా వచ్చాక జర్నలిజం విలువలు పడిపోతున్నాయి. చేతిలో సెల్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టులాగానే వ్యవహరిస్తునా‍్నరు. తమకు తెలిసిందే జర్నలిజం అన్నట్లుగా వీడియోలు, వార్తలు, కథనాలు ప్రసారం చేస్తున్నారు. దీంతో సామాన్యుల సంగతి అటుంచితే ప్రధాని మోదీ, సీఎంల గురించి కూడా ఇష్టానుసారం కథనాలు రాస్తున్నారు. వారి కుటుంబ సభ్యులపైనా పోస్టులు పెడుతున్నారు. సంచలనాలు, లైక్‌లు, షేర్ల కోసం ఇష్టానుసారం వార‍్తలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియా జర్నలిజం, పోస్టులపై తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో అనుచిత భాష వాడటం, కుటుంబ సభ్యులు, మహిళలపై దాడి చేసేలా పోస్టులు పెట్టడం సహించేది లేదని హెచ్చరించారు. రాజకీయ విమర్శలు స్వాగతమని, కానీ వ్యక్తిగత దూషణలు, ముఖ్యంగా ఆడపిల్లల వీడియోలు తీసి పోస్ట్ చేయడం వంటివి ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. అవసరమైతే చట్టాలను సవరించి, ఇలాంటి చర్యలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “ఇది నా ఒక్కరి ఆవేదన కాదు, సమాజంలోని అందరి ఆవేదన. స్వీయ నియంత్రణతో పాటు చట్టపరమైన నియంత్రణ కూడా ఉండాలి” అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొందరు దీన్ని సమర్థిస్తుండగా, మరికొందరు ఇలాంటి భాష, చర్యలు స్వేచ్ఛను హరిస్తాయని విమర్శిస్తున్నారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు..
సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై రెండు గంటలకు పైగా ప్రసంగించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై తీవ్రంగా స్పందించారు. కుటుంబ సభ్యులు, మహిళలపై అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసీఆర్‌తోపాటు ఇతరులకు తమ పిల్లలకు బుద్ధి చెప్పాలని సూచించారు. సమస్యలు చెప్పి సరిదిద్దుకుంటామని, కానీ అనుచిత పోస్టులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాపై చర్చ జరపాలని, స్వీయ నియంత్రణతో పాటు చట్టపరమైన నియంత్రణ అవసరమని పేర్కొన్నారు.
నన్ను తిడుతూ వీడియోలు పెట్టినోళ్లను తోడికల్ తీస్తా, బట్టలిప్పదీసి రోడ్డు మీద తిప్పిస్తా – సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/QjwcxWLsI1
— Telugu Scribe (@TeluguScribe) March 15, 2025