https://oktelugu.com/

TDS Rules: ఇక నుంచి రూ.7లక్షలు కాదు రూ.10లక్షలు..ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్

TDS Rules : ట్యాక్స్ పేయర్లకు పలు రకాల పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులు రూ.50 లక్షలకుపైగా అమ్మకాలు చేసే వాటిపై టీసీఎస్ రద్దు చేశారు... అంటే వారికి కొండంత భారం తగ్గుతుంది. అలాగే విదేశాలకు మనీ ట్రాన్సఫర్ చేసే వారికి సైటం ట్యాక్స్ లిమిట్ పెంచారు.

Written By: , Updated On : March 19, 2025 / 10:30 PM IST
TDS Rules

TDS Rules

Follow us on

TDS Rules: ట్యాక్స్ పేయర్లు, వ్యాపారస్తులకు భారీ ఊరట లభించింది. పన్ను భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా ట్యాక్స్ కలెక్టడ్ ఎట్ సోర్స్(టీసీఎస్), ట్యాక్స్ డిడెక్టెడ్ ఎట్ సోర్స్(టీడీఎస్)కు సంబంధించి కీలక మార్పులు చేసింది. ఈ రెండు ట్యాక్స్ విధానాలకు సంబంధించిన కొత్త రూల్స్ వచ్చే నెల అంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. వీటి వల్ల ట్యాక్స్ పేయర్లకు పలు రకాల పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులు రూ.50 లక్షలకుపైగా అమ్మకాలు చేసే వాటిపై టీసీఎస్ రద్దు చేశారు… అంటే వారికి కొండంత భారం తగ్గుతుంది. అలాగే విదేశాలకు మనీ ట్రాన్సఫర్ చేసే వారికి సైటం ట్యాక్స్ లిమిట్ పెంచారు.

Also Read : క్రెడిట్ కార్డులు కావాలా అని కాల్స్ వస్తున్నాయా.. ఎందుకు బ్యాంకు వాళ్లు కాల్స్ చేస్తారంటే?

టీడీఎస్ లిమిట్ పెంచారు. మీరు బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి వడ్డీ తీసుకుంటున్నా.. పెద్ద పెద్ద పేమెంట్స్ చేస్తున్నప్పుడు లిమిట్ దాటినప్పుడు టీడీఎస్ కట్ అవుతుంది. అయితే, ఈ లిమిట్స్ సవరించింది కేంద్రం. ఒకే పేమెంట్‌పై పలుసార్లు పడే ట్యాక్స్ నుంచి ఉపశమనం లభించినట్లయింది. ఒకసారి టీడీఎస్ కట్ అయితే మళ్లీ తిరిగి కట్టాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం చాలా మంది పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు. వారి ఖర్చుల నిమిత్తం తల్లిదండ్రులు పిల్లల కోసం డబ్బులు పంపిస్తుంటారు. అలా డబ్బులు లేదా కుటుంబ ఖర్చులు వంటి ఏదైనా కారణం చేత విదేశాలకు మనీ ట్రాన్స్ ఫర్ చేసే వారికి భారీ ఊరట లభించింది. ఇప్పటి వరకు విదేశాలకు రూ.7 లక్షలకు మించి డబ్బులను పంపితే టీసీఎస్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఆ లిమిట్ ను ప్రస్తుతం రూ.10లక్షలకు పెంచింది కేంద్రం. ఇప్పుడు రూ.10లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా విదేశాలకు డబ్బులు పంపించవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ లోన్ ద్వారా డబ్బు పంపితే ఎలాంటి టీసీఎస్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది విదేశాల్లో చదివే స్టూడెంట్లకు భారీ ఉపశమనంగా చెప్పుకొవచ్చు.

అలాగే టీసీఎస్ కు సంబంధించి వ్యాపారస్తులకు కూడా కేంద్రం ఊరట కల్పించింది. రూ.50 లక్షలు ఆపైన విక్రయాలు జరిపే ట్రాన్సాక్షన్ల మీద ఇప్పటి వరకు 0.1 శాతం టీడీఎస్ చెల్లీంచాల్సి వచ్చేది. ఇప్పుడు దానిని కూడా ప్రభుత్వం ఎత్తేసింది. వీరితో పాటు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయని వారు సైతం ఎలాంటి టీసీఎస్, టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. కేవలం ఐటీఆర్ ఫైల్ చేసే వారు మాత్రమే టీడీఎస్, టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.

Also Read : సామాన్యుల కోసం EPFO కొత్త రూల్స్.. ఉద్యోగుల ఖాతాల్లో భారీగా డబ్బులు..