Heavy Rains In Telangana: అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలు పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. అక్టోబర్ 10 వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరికతో ఆరు జిల్లాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు. నిజామాబాద్, నల్గొండ, సూర్యపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని సమాచారం. శనివారం నిజామాబాద్, నల్గొం, సూర్యపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని చెబుతోంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆది, సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని చెబుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో శుక్ర, శనివారాల్లో పలుచోట్ల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. ఈనెల 10 వరకు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మహారాష్ట్రలో కొనసాగుతున్న అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడిన తేమతో కోస్తాంధ్రలోని ఏలూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడతాయని చెబుతున్నారు. దీంతో భారీ వర్షాలతో పంటలు దెబ్బ తింటున్నాయి.

ఇది వరకే ప్రాజెక్టులు అన్ని నిండిపోవడంతో ఇప్పుడు కురిసే వానలతో పంటల్లోకి నీరు చేరుతోంది. జులైలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్ని నిండుకుండల్లా మారడంతో పంటలకు నష్టం కలగనుంది. పంటల్లోకి నీరు చేరడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రుతుపవనాలు పోయినా అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడటంతో పంటలకు దెబ్బ తగలనుంది. దీనిపై ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతుల కష్టాలను పరిగణనలోకి తీసుకుని నష్టపరిహారం అందించాలని ప్రాధేయపడుతున్నారు.
[…] […]