Bigg Boss 6 Telugu Day 32: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ ప్రారంబమైన బిగ్ బాస్ సీసన్ 6 ఇప్పుడు ఎంత రసవత్తరంగా సాగుతుందో మన అందరికి తెలిసిందే..సీసన్ ప్రారంభం చప్పగా సాగడం తో ఈ సీసన్ పెద్ద ఫ్లాప్ అవుతుందేమో అని అనుకున్నారు అందరూ..కానీ రెండవ రోజు నాగార్జున హౌస్ మేట్స్ లో ఫైర్ రగిలించడం తో టాస్కులు బాగా ఆడడం ప్రారంభించారు..అప్పటి నుండి ఈ షో కి TRP రేటింగ్స్ రోజు రోజు కి పెరుగుతూ వచ్చింది..ఇక ఈ వారం బిగ్ బాస్ పుట్టిన రోజు వేడుకలు అంటూ చేపట్టిన ఒక టాస్క్ లో కంటెస్టెంట్స్ తమకి తోచిన విధంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ అలరించారు..ఈ వారం గొడవలు మరియు పెద్ద పెద్ద హై డ్రామా లేకుండా ఫన్ తోనే గడిచింది..ముఖ్యంగా గీతూ, శ్రీహన్ మరియు సూర్య లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేసారు..అయితే బిగ్ బాస్ షో డిస్నీ + హాట్ స్టార్ లో 24 గంటలు అందుబాటులో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది అనే విషయం మన అందరికి తెలిసిందే.

ఇక్కడ చూపించే ఫుటేజీ టీవీ లో ప్రసారం అయ్యేటప్పుడు కొన్ని చూపించరు..అలా గీతూ మరియు రేవంత్ మధ్య జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..రేవంత్ టాస్కులో భాగంగా గీతూ బుగ్గ మీద ముద్దు పెట్టడం పై గీతూ అభ్యంతరం వ్యక్తం చేసింది..నీ ఉద్దేశ్యం వేరైనా నేను కాస్త అన్ కంఫర్ట్ ఫీల్ అయ్యానని..టీవీ లో చూస్తున్న మీ ఆవిడ గారు ఇంకా ఎలా ఫీల్ అయ్యి ఉంటారో అంటూ గీతూ రేవంత్ తో అంటుంది.

అప్పుడు రేవంత్ ఛీ ఛీ అలాంటిది ఏమి..నేను ఆ ఉద్దేశ్యం తో చెయ్యలేదు..కేవలం టాస్కులో భాగంగానే చేశాను అంటూ చెప్పుకొచ్చాడు..నిన్న ఫైమా మీద పడుకున్నావ్..ఆ అమ్మాయి ఎలా అనుకోని ఉంటుందో..నీ ఉద్దేశ్యాలు వేరైనా చూసే ప్రేక్షకులు నిన్ను తప్పుబట్టే అవకాశం ఉందని గీతూ చెప్పడం తో ఫైమా వద్దకి వెళ్లి క్షమాపణలు కోరుతాడు రేవంత్..అప్పుడు ఫైమా అలాంటిది ఏమి లేదు..నేను ఏమి అనుకోలేదంటూ రేవంత్ కి చెప్తుంది..ఈ బ్లాక్ మొత్తం టీవీ లో ప్రసారం కాలేదు.