Heat Waves: తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం 9 గంటల నుంచే నిప్పులు కురిపిస్తున్నాడు. అనేక జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌పైగా నమోదవుతున్నాయి. వాతావరణం పొడిగా ఉంటోంది. దీంతో వేడి ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎండ సమయంలో ఎవరూ బయటకు రావద్దని అప్రమత్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా హెల్త్ అడ్వైజరీ విడుదల చేసింది.
మధ్యాహ్నం 12 తర్వాత..
వాతావారణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మధ్యాహ్నం 12 నుంచి 3గంటల ప్రాంతంలో ఎవరూ బయటకు రావొద్దని ఆరోగ్యశాఖ సూచించింది. ఎండల తీవ్రత అధికంగా ఉన్న తరుణంలో.. మద్యం, టీ, కాఫీతోపాటు చకె‍్కర స్థాయిలు అధికంగా ఉండే శీతలపానీయాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఇవి శరీరంలో నీరు కోల్పోయేలా చేస్తాయని వెల్లడించింది. ఎండపూట వాటిని అస్సలు తాగొద్దని తెలిపింది.
ముందుజాగ్రత్త చర్యగా..
ఇక ప్రజారోగ్య కేంద్రాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ప్రజారోగ్య కేంద్రాల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్స్, ఔషధాలు అందుబాటులో ఉంచామని తెలిపింది. వడదెబ్బ తగిలితే వెంటనే వైదు‍్యడిని సంప్రదించాలని తెలిపింది. సొంత వైద్యం, ఇంటి చిట్కాలతో ప్రమాదమని పేర్కొంది. వాంతులు, విరోచనాలు, నీరసం, జ్వరం వంటి లక్షణాలు ఉంటే ఆస్పత్రికి వెళ్లాలని సూచించింది.
దేశమంతా..
ఇక ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా మధ్య, పశ్చిమ భారత్‌లో వడగాలులు ఎక్కువగా వీస్తాయని వెల్లడించింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఏప్రిల్, జూన్ మధ్యకాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మైదాన ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ రోజులు వేడిగాలులు వీస్తాయని పేర్కొంది.