Homeటాప్ స్టోరీస్Telangana College Girls Free Scooters Scheme: డిగ్రీ, బీటెక్ అమ్మాయిలకు ఫ్రీగా స్కూటీలు.. రేవంత్...

Telangana College Girls Free Scooters Scheme: డిగ్రీ, బీటెక్ అమ్మాయిలకు ఫ్రీగా స్కూటీలు.. రేవంత్ పెద్ద ప్లానే వేశాడే?

Telangana College Girls Free Scooters Scheme: తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీ హామీలు ఇచ్చింది. దీంతో ప్రజలు పట్టం కట్టారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా.. ఉచిత బస్సు, రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొన్ని రోజులు రూ.500లకు గ్యాస్‌ అందించారు. అనేక హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఫ్రీ బస్సు మినహా మిగతావేవీ పూర్తిగా అమలు కావడం లేదు. దీంతో విపక్షాలు, ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ హామీల అమలునే టార్గెట్‌ చేస్తోంది. దీంతో రేవంత్‌రెడ్డి సర్కార్‌ మరో మామీ నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది.

Also Read: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?

డిగ్రీ విద్యార్థినులకు స్కూటీలు..
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డిగ్రీ, బీటెక్‌ విద్యార్థినులకు ఉచిత ఎలక్ట్రిక్‌ స్కూటీల పంపిణీ దశలవారీగా అమలు చేయాలని రేవంత్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఈమేరకు ప్రణాళిక రూపొందిస్తోంది. సుమారు 1.70 లక్షల మంది అర్హులకు స్కూటీలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొనుగోలుకు రూ.1,600 కోట్లు అవసరమవుతుందని అంచనా. వచ్చే బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరుగనుంది. ఎంపిక ప్రక్రియలో డ్రైవింగ్‌ లైసెన్స్, కాలేజీ వివరాలు పరిగణనలోకి తీసుకుంటారు.

అమలు విధానం ఇలా..
పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఒక జిల్లాలో ప్రారంభించి విస్తరించే అవకాశం ఉంది. కేంద్ర FAME–2 స్కీమ్‌ రాయితీలను ఉపయోగించి ఒక్కో వాహనం రూ.50 వేలకు లభిస్తుంది. బల్క్‌ కొనుగోలుతో ఖర్చు తగ్గుతుంది. దీంతో భారంత తగ్గుతుందని అంచనా.

విద్యార్థినులకు ప్రయోజనాలు
ఈ చర్య యువతుల సౌకర్యాన్ని పెంచుతూ హైదరాబాద్‌ కాలుష్యాన్ని అరికట్టుతుంది. డీజిల్‌ బస్సులు బద్దలుకొట్టినట్టు ఈవీల ప్రోత్సాహం కాలేజీ హాజరు పెంచుతుంది. మహిళా విద్యార్థినుల సాధికారతకు దోహదపడుతుంది. అయితే స్కూటీల నిర్వహణ, ఛార్జింగ్‌ స్థావరాల అవసరం ఉంటుంది. అర్హతల స్పష్టత లేకపోతే దరఖాస్తుల గందరగోళం రావచ్చు. బడ్జెట్‌ కేటాయింపు సరైనదైతే ప్రణాళిక విజయవంతమవుతుంది.

ఎన్నికల హామీ అమలు ప్రభుత్వ విశ్వసనీయతను పెంచుతుంది. లాంగ్‌టర్మ్‌లో ఈవీ ఆధారిత రవాణా వాడకం పర్యావరణ సంరక్షణకు దోహదపడుతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక భారాన్ని తట్టుకునేలా దశలవారీ అమలు మంచిది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version