Homeహెల్త్‌Sleep Deprivation: ఒక్క రాత్రి నిద్ర సరిగ్గా పోకపోతే ఏం జరుగుతుందో తెలుసా..

Sleep Deprivation: ఒక్క రాత్రి నిద్ర సరిగ్గా పోకపోతే ఏం జరుగుతుందో తెలుసా..

Sleep Deprivation: ప్రతి మనిషికి ఆకలి.. శృం**తర్వాత అత్యంత ముఖ్యమైనది నిద్ర. కునుకు సరిగ్గా తీస్తేనే శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. జీవక్రియలు మెరుగ్గా జరుగుతాయి. నిద్ర అనేది ఒక భౌతిక చర్య మాత్రమే కాదు.. శరీరానికి ఒక రిలాక్స్ మోడ్. ఒక యంత్రం అదే పనిగా పనిచేస్తుంటే ఎలా అయితే మారిపోతుందో.. మన శరీరం కూడా విశ్రాంతి తీసుకోకపోతే అలానే అయిపోతుంది. అందువల్లే కచ్చితంగా నిద్ర కావాలి. కంటి నిండా నిద్రపోవాలి.

ఒక మనిషికి 7 గంటలపాటు నాణ్యమైన నిద్ర కచ్చితంగా అవసరం. చిన్నపిల్లలు ఎక్కువ సేపు నిద్రపోతుంటారు కాబట్టి వారికి ఈ నిబంధన వర్తించదు. నిద్రపోతున్న సమయంలోనే శరీరం లో జీవక్రియలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ సమగ్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఒక్క రాత్రి కూడా సరిగా నిద్రపకపోతే ఇన్సులిన్ సెన్సిటివిటీ 30% వరకు తగ్గుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ సక్రమంగా ఉంటేనే రక్తంలో చక్కెరల స్థాయి నియంత్రణలో ఉంటుంది. మెరుగైన జీవక్రియలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

రక్తంలో చక్కెరల స్థాయి నియంత్రణలో ఉండకపోతే చాలా రకాలైన వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా డయాబెటిక్ వంటి సమస్య ఎదురవుతుంది. అలాంటప్పుడు నాణ్యమైన నిద్ర ప్రతి మనిషికి ఉండాలి. నిద్ర సక్రమంగా ఉండాలంటే శారీరక వ్యాయామం చేయాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. రాత్రిపూట త్వరగా పడుకోవాలి. ఎక్కువసేపు ఫోన్ చూడకూడదు.. ముఖ్యంగా ఎక్కువ కాంతిలో ఉండకూడదు.

నిద్ర సక్రమంగా పట్టాలి అంటే యోగా చేయాలి. ఉదయం పూట వ్యాయామం చేయాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. సాధ్యమైనంతవరకు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నిద్ర కూడా సక్రమంగా పడుతుంది.

ఈ కథనం కేవలం పాఠకులకు అవగాహన కల్పించడానికి మాత్రమే. వైద్య చికిత్సకు ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version