Homeక్రీడలుక్రికెట్‌India ODI World Cup 2027: తొక్కలో గంభీర్..వరల్డ్ కప్ లో రోకో ఆడుతున్నారహే

India ODI World Cup 2027: తొక్కలో గంభీర్..వరల్డ్ కప్ లో రోకో ఆడుతున్నారహే

India ODI World Cup 2027: 2027 వరల్డ్ కప్ ఎలాగైనా సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఇందులో భాగంగానే పటిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తోంది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటినుంచే సమర్థవంతమైన జట్టును రూపొందించాలని.. అద్భుతమైన ప్లేయర్లను తయారు చేయాలని మేనేజ్మెంట్ కృత నిశ్చయంతో ఉంది..

వన్డే వరల్డ్ కప్ సాధనలో భాగంగా రూపొందించే జట్టులో విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ ఉండరని ఆమధ్య ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే కోచ్ గౌతమ్ గంభీర్ కూడా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు. అప్పటివరకు ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో తెలియదని.. సమర్థవంతమైన ఆట తీరు కొనసాగించే వారికి మాత్రమే జట్టులో చోటు ఉంటుందని.. గౌతమ్ గంభీర్ అనేక పర్యాయాలు చెప్పారు. దీంతో విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ వన్డే వరల్డ్ కప్ లో ఆడే అవకాశం లేదని అభిమానులు ఒక అంచనాకొచ్చారు.

గౌతమ్ చెప్పే మాటలు ఆ విధంగా ఉంటే.. కెప్టెన్ గిల్ మాత్రం మరో విధంగా మాట్లాడుతున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో భాగంగా.. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. “సౌత్ ఆఫ్రికా లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం ఎటువంటి ప్లేయర్లు ఉండాలి.. ఎటువంటి జోడి అయితే బాగుంటుంది అనే చర్చ సాగిస్తున్నాం.. విరాట్.. రోహిత్ కచ్చితంగా టీమిండియా కు బలమైన సపోర్ట్ ఇస్తారు.. వారిద్దరు జట్టుకు వెన్నెముకలాగా ఉంటారు.. వారి సేవలు వినియోగించుకుంటాం. వారి అనుభవం అవసరమని” గిల్ వ్యాఖ్యానించాడు. దీంతో వారిద్దరు వన్డే వరల్డ్ కప్ లో ఉంటారని గిల్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.. అయితే గంభీర్.. గిల్ ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉండడంతో.. అభిమానంలో ఒకరకమైన సందిగ్ధం ఉంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఇంకా కొద్దిరోజులు ఆగాల్సి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.

ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో విఫలమైనప్పటికీ… రోహిత్.. విరాట్ మీద అభిమానులకు భారీగానే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే వీరిద్దరికి ఫాంతో సంబంధం ఉండదు. సుదీర్ఘకాలం వీరిద్దరు క్రికెట్ ఆడుతున్నారు. అన్ని జట్ల మీద వీరిద్దరికి మెరుగైన రికార్డులు ఉన్నాయి. పైగా వీరిద్దరూ జట్టులో ఉంటే ప్లేయర్లలో విపరీతమైన పాజిటివిటీ ఉంటుంది. అందుకోసమైనా మేనేజ్మెంట్ వీరిద్దరిని ఎంపిక చేస్తుందని.. జట్టులో చోటు కల్పిస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version