Homeఆంధ్రప్రదేశ్‌Jada Shravan: రావణ్, వైసిపి మీద రగిలిపోతున్న జడ శ్రావణ్..

Jada Shravan: రావణ్, వైసిపి మీద రగిలిపోతున్న జడ శ్రావణ్..

Jada Shravan: ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాలలో జడ శ్రావణ్ ఒక కేంద్ర బిందువు లాగా మారిపోయారు. జడ్జిగా పనిచేసిన ఆయన.. ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. గడిచిన ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు ఆయనకు అంతగా ప్రాచుర్యం లభించలేదు. కానీ ఇటీవల కాలంలో ఆయన గురించి విపరీతంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.. దానికి తోడు ఆయన పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

రావణ్ అరెస్ట్ అయిన తర్వాత.. అతడికి బెయిల్ ఇప్పించడానికి జడ శ్రావణ్ రంగంలోకి దిగారు. పోలీసులు ఎన్ని రకాలుగా కేసులు పెట్టినప్పటికీ.. జడ శ్రవణ్ తన చాకచక్యంతో రావణ్ ను విడిపించుకుని వచ్చారు. తద్వారా రావణ్ ఏపీ పోలీసుల మీద పైచేయి సాదించే విధంగా చేశారు. దీనికోసం జడ శ్రావణ్ కొన్ని డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు. రావణ్ ను బయటికి తీసుకు రావడానికి శ్రవణ్ ఒక పైసా కూడా ఫీజుగా తీసుకోలేదని వార్తలు వస్తున్నాయి.

రావణ్ కోసం శ్రావణ్ ఇంత చేసినప్పటికీ.. ఆయనకు అనుకున్నంత గుర్తింపు రాలేదా.. దళిత క్రైస్తవులు ఆయనకు ఆశించిన స్థాయిలో గౌరవం ఇవ్వలేదా.. చివరికి వైసిపి శ్రావణ్ సేవలను గుర్తించలేదా.. ఈ ప్రశ్నలకు ఔను అనే సమాధానమే వస్తోంది. శ్రవణ్ శ్రావణ్ కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. కోర్టుల చుట్టూ తిరిగారు. డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఇంత చేసినప్పటికీ శ్రవణ్ అనుకున్న స్థాయిలో గుర్తింపు పొందలేదు. అయితే దీనికి ప్రధాన కారణం వైసిపి అని శ్రవణ్ భావిస్తున్నారు..

రావణ్ కోసం ఆయన బృందంలో పని చేస్తున్నవారు వైసీపీని సంప్రదించడం శ్రవణ్ కు ఏమాత్రం నచ్చలేదు. పైగా రావణ్ వ్యవహారాన్ని వైసిపి తనకు అనుకూలంగా మార్చుకోవడం మొదలుపెట్టింది. ఇది శ్రవణ్ కు ఇబ్బందికరంగా మారింది. మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల శ్రవణ్ రావణ్ కేసులను విచారించకుండా పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని శ్రావణ్ వివరించారు.. అంతేకాదు వైసిపి పై ప్రజల్లో పెద్దగా సానుభూతి లేదని.. రావణ్ వ్యవహారాన్ని రాజకీయంగా వైసిపి వాడుకుంటున్నదని శ్రవణ్ ఆరోపిస్తున్నారు. రావణ్ కేసులో ప్రకాష్ రాజ్ అనేకసార్లు శ్రవణ్ కు ఫోన్ చేశారు. ఈ కేసు విషయంలో తప్ప.. ప్రకాష్ రాజ్ తో గొప్ప సంబంధం లేదని.. కనీసం వాట్సాప్ లో చాట్ చేసిన సందర్భం కూడా లేదని శ్రవణ్ చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version