HomeతెలంగాణWeather : పొద్దున చలి.. మధ్యాహ్నం ఎండ.. భిన్నంగా మారుతోన్న వాతావరణం.. వ్యాధులకు ఆస్కారం!

Weather : పొద్దున చలి.. మధ్యాహ్నం ఎండ.. భిన్నంగా మారుతోన్న వాతావరణం.. వ్యాధులకు ఆస్కారం!

Weather :  ప్రస్తుతం శీతాకాలం. చలి(Cool) తీవ్రత కొనసాగుతోంది. అయితే ఇదే సమయంలో మధ్యాహ్నం ఎండ దంచి కొడుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెల్లవారు జాము వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకన్నా తక్కువగా నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో తెల్లవారాక కూడా లైట్లు వేసుకుని వెళ్తున్నారు. ఇక ఉదయం 9 గంటలు దాటగానే మళ్లీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.

సాధారణం కన్నా ఎక్కువగా..
పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా శీతాకాలం(Winter)లో 25 నుంచి 30 డిగ్రీలలోపే నమోదు కావాలి. కానీ, వారం పది రోజులుగా తెలంగాణలో భిన్నంగా ఉంటున్నాయి. 30 నుంచి 32 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 34 డిగ్రీల వరకు పెరుగుతున్నాయి. దీంతో ఎండ తీవ్రత ఎక్కువగా అనిపిస్తోంది. చిరు వ్యాపారులు, మధ్యాహ్నం బయటకు వచ్చిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి చలికి గజగజ వణుకుతున్న జనాలు.. పగలు ఎండలు చూసి ఇప్పుడే ఇంత ఎండలా అని ఆశ్చర్యపోతున్నారు.

భిన్న వాతావరణంతో ఇబ్బందులు..
తెలంగాణలో ప్రస్తుతం భిన్న వాతావరణం నెలకొంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి ఉష్ణోత్రలు కొన్ని జిల్లాలో 10 డిగ్రీలకు దిగువన నమోదవుతున్నాయి. బుధవారం(జనవరి 22)న సంగారెడ్డిలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలుగా నమోదైంది. కుమురంభీం ఆసిఫాబాద్‌లో 7, రంగారెడ్డిలో 8, వికారాబాద్‌లో 9, కామారెడ్డి, రాజన్న సిరిసల్ల, మహబూబ్‌నగర్‌లో 10, నిర్మల్, ఆదిలాబాద్‌లో 12 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యా. జీహెచ్‌ఎంసీ(GHMC) పరదిలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాజేంద్రనగర్‌లో 9 డిగ్రీలు, పటాన్‌చెరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

పగలు ఎక్కువగా..
ఇక పగలు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 32 డిగ్రీలుగా నమోదైంది. ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి తదితర జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి.

వ్యాధులు ప్రభలే అవకాశం..
మారుతున్న వాతావరణం వ్యాధులకు కారణమవుతోంది. చలి, ఎండ కారణంగా శరీరం మార్పులకు లోనవుతోంది. దీంతో దగ్గు, జలుబు. జ్వరం కేసులు పెరుగుతున్నాయి. ఇక ఉష్ణోగ్రతలు పెరిగితే డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఇలాంటి వాతావరణం దోమలు(Musqutios) వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం ఎండ కారణంగా శీతల పానీయాలు తీసుకోవడం, రాత్రి చలికి దుప్పట్లు కప్పుకోవడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు. చల్లని పదార్థాలు తీసుకోవద్దని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఈ వాతావరణ పరిస్థితులు మరో పది రోజులు ఇలాగే ఉంటాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular