Varun Chakravarthi : కోల్ కతా(Kolkata) లో బుధవారం రాత్రి ఇంగ్లాండ్(England), భారత్ (India) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. భారత్ ఏకంగా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో అందరి ఆటగాళ్లకు పాత్ర ఉంది. ముందుగా బౌలర్లు ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించారు. ఆ తర్వాత బ్యాటర్లు ఆకాశమేహద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా సంజు శాంసన్ ( Sanju Samson), అభిషేక్ శర్మ( Abhishek Sharma) ఇంగ్లాండ్ బౌలర్ల బౌలింగ్ ను ఊచ కోత కోశారు.. మూడు వికెట్ల మాత్రమే కోల్పోయి ఇంగ్లాండ్ విధించిన లక్ష్యాన్ని చేదించారు. తద్వారా మరో సిరీస్ విజయానికి బాటలు వేసుకున్నారు. వాస్తవానికి అభిషేక్ శర్మ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ నిర్వాహకులు మాత్రం వరుణ్ చక్రవర్తికి ఆ పురస్కారం అందించారు.. దీనినిబట్టి వరుణ్ చక్రవర్తి ఏ స్థాయిలో బౌలింగ్ వేసాడో అర్థం చేసుకోవచ్చు.. ఈడెన్ గార్డెన్స్ లో తేమను అనుకూలంగా మలుచుకొని బంతులు వేయడం అంత సాధ్యం కాదు. హేమ హేమ ఇలాంటి బౌలర్లకే ఇది ఒక పట్టాన కొరుకుడు పడదు. కానీ వరుణ్ చక్రవర్తి అంతకుమించి అనే లెవెల్లో బౌలింగ్ వేశాడు. సుడులు తిరిగే బంతులు వేసి ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు..బ్రూక్ (brook), లివింగ్ స్టోన్(livingstone), బట్లర్(butler) వికెట్లను పడగొట్టాడు.. నాలుగు ఓవర్లు వేసిన వరుణ్ చక్రవర్తి.. 23 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు నేల కూల్చాడు. బ్రూక్, లివింగ్ స్టోన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇందులో లివింగ్ స్టోన్ సున్నా పరుగులకు అవుట్ కావడం విశేషం.
మరో అనిల్ కుంబ్లే అవుతాడు
సునాయాసంగా బంతిని మెలి తిప్పడంలో వరుణ్ చక్రవర్తి సిద్ధహస్తుడు. అందువల్లే బంతిని రకరకాలుగా తిప్పి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. బుధవారం కూడా ఈడెన్ గార్డెన్ లో దానినే మరోసారి ప్రదర్శించాడు. ఇటీవల దక్షిణాఫ్రికా టూర్ లో మెరిసిన వరుణ్ చక్రవర్తి.. ఇంగ్లాండ్ జట్టుపై కూడా అదే మాయాజాలాన్ని ప్రదర్శించాడు. షార్ట్ పిచ్ బంతులు వేసి.. బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అందువల్లే అతడి బౌలింగ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు సరిగా ఆడలేకపోయారు. వరుణ్ చక్రవర్తిని ఇంకా సాన పెడితే అతడు కచ్చితంగా టీమిండియా కు వజ్రాయుధమవుతాడు. టీమ్ ఇండియా సాధించే విజయాలలో ముఖ్యపాత్ర పోషిస్తాడు. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తో టీమిండియాను ప్రధాన స్పిన్నర్ కొరత వేధిస్తోంది. వరుణ్ చక్రవర్తిని కేవలం టి20 ఫార్మాట్ కు మాత్రమే కాకుండా.. టెస్ట్, వన్డేల లోనూ ఆడిస్తే టీమిండియా కు తిరుగు ఉండదు. మణికట్టు తో మాయాజాలాన్ని ప్రదర్శించడంలో వరుణ్ చక్రవర్తి దూకుడు కొనసాగిస్తున్నాడు. అందువల్లే అతని బౌలింగ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆడలేకపోయారు. ఇటీవల దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా అదే విధంగా ఇబ్బంది పడ్డారు. ఐపీఎల్ లోనూ వరుణ్ చక్రవర్తి తనదైన మ్యాజిక్ ప్రదర్శించాడు. టి20 లో అవకాశం దక్కడంతో ఐపీఎల్ అనుభవాన్ని వరుణ్ చక్రవర్తి ఇక్కడ ఉపయోగించుకుంటున్నాడు. గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ వరుణ్ చక్రవర్తి మీద సరైన దృష్టి సారిస్తే.. టీ మీడియా అమ్ములపొదిలో నాణ్యమైన స్పిన్ బౌలర్ ఉంటాడనటంలో ఎటువంటి సందేహం లేదు. మరోవైపు వరుణ్ చక్రవర్తిని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేస్తే.. టీమిండియా కచ్చితంగా విజేతగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేయకుండా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తప్పు చేసిందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.