Good News: ప్రీమియం బైక్ కావాలనుకునే వారికి Royal Enfield శుభవార్త తెలిపింది. యువతను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన డిజైన్లతో టూ వీలర్స్ ను తీసుకొచ్చే ఈ కంపెనీ తాజాగా Modern బైక్ ను ప్రవేశపెట్టింది. కొత్త ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్ ను చూసి చాలామంది ఇంప్రెస్ అవుతున్నారు. అయితే దీని ధర కాస్త ఎక్కువ అయినా కూడా డిజైన్ తో పాటు డ్రైవింగ్ అనుభూతి అద్భుతంగా ఉండడంతో చాలామంది లైక్ చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన బైక్ లో కంటే దీని డిజైన్ డిఫరెంట్ గా ఉండడంతో పాటు ఇంజన్ పవర్ కూడా అద్భుతంగా ఉండడంతో దీని కొలువులకు ఆసక్తి చెబుతున్నారు ఇంతకీ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వచ్చిన ఆ బైక్ ఏది? అది ఎలా ఉంది ఒకసారి పరిశీలిద్దాం..
Royal Enfield బైక్ అంటే లైక్ చేయని వారు ఉండరు. దీని డిజైన్ తోపాటు హార్స్ పవర్ అప్డేట్ గా ఉండడంతో ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయినా కూడా ఈ కంపెనీ నుంచి ఏ కొత్త బైక్ మార్కెట్ లోకి రిలీజ్ అయిన వెంటనే దాని గురించి తెలుసుకుంటారు. ఈ ఏడాది ప్రారంభంలో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి స్క్రామ్ 450 (Scram) బైక్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం రెండు కలాలలో అందుబాటులో ఉంది. టెలిస్కోపిక్ ఫోర్క్ తో పాటు మోనోషాట్ సస్పెన్షన్ సెటప్ ను అమర్చిన ఇది బ్రేకింగ్ సిస్టం లేటెస్ట్ గా అనిపిస్తుంది. అలాగే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం తో పాటు డ్యూయల్ డిస్క్ బ్రేకింగ్ సిస్టంను అమర్చారు. ఇప్పటివరకు వచ్చిన బైక్ లలో సాధారణ సీటింగ్ ఉండేది. కానీ దీనికి రైడర్కు అనుగుణంగా ప్రత్యేకంగా అమర్చారు.
స్క్రామ్ 450 ముందు హెడ్ లైట్ప్ సెట్ అప్ ను అమర్చారు. వీటికి తోడు స్మార్ట్ఫోన్ ఛార్జ్ చే యడానికి యూఎస్బీ చార్జర్, హ్యాండిల్ బార్ ను సెట్ చేశారు. 17 అంగుళాల స్పోక్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లను కలిగిన రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 450 డిజైన్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో ట్రయంప్ స్క్రామ్ బార్లు 400 x స్క్రాంబార్లు ఉండటం ఉండడంతో ప్రత్యేకంగా నిలుస్తుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రాం 450 ఇంజన్ శక్తివంతమైనదిగా చెప్పుకోవచ్చు. ఇందులో 450 పవర్ ట్రైన్ తో పాటు 443 సి సి ఎయిర్ /ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్ తో పాటు 25.4 bhp హార్స్ పవర్ 34 nm tarl ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణంగానే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ చాలా కాస్ట్లీ గా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన స్క్రామ్ 450 ధర రూ.2,08,000 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. రెండో వేరియంట్ ఫోర్స్ ప్రారంభం ధర 2.5 లక్షల నుంచి మొదలవుతుంది.