Congress Cabinet Expansion : బోధన్ శాసనసభ్యుడిగా ఉన్న సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్నారు. సుదర్శన్ రెడ్డిని మంత్రిని చేయడానికి రేవంత్ రెడ్డి అనేక సందర్భాలలో హస్తిన వెళ్లిపోయారు. గట్టిగా సిఫారసు కూడా చేశారు. అయినప్పటికీ అధిష్టానం రేవంత్ రెడ్డి మాట పట్టించుకోనట్టు తెలుస్తోంది. సుదర్శన్ రెడ్డిని పక్కనపెట్టి.. సామాజిక సమతూకంతో బీసీ, ఎస్సీ లకు మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించి.. దానిని అమలులో పెట్టినట్టు తెలుస్తోంది. వాస్తవంగా ఈ పరిణామం సుదర్శన్ రెడ్డి ఇలాంటి వారికి మింగుడు పడడం లేదని ఆయన వర్గీయులు అంటున్నారు. అందువల్లే మంగళవారం బోధన్ బందుకు వారు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి అనేక సందర్భాలలో మంత్రి పదవులు ఆశించి భంగపడిన సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి వంటి వారితో చర్చలు జరిపారు. భవిష్యత్తులో జరిగే విస్తరణలో ప్రాధాన్యం కల్పిస్తామని మాట ఇచ్చారు. ఆ సమయంలో వారు మీనాక్షి మాట విన్నప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ అలకపాన్పు ఎక్కారు.
Also Read : ముగ్గురు మంత్రులు వివేక్, లక్ష్మణ్, శ్రీహరి రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైందంటే..
మల్ రెడ్డి రంగారెడ్డి అగ్రహం
ఇక మల్ రెడ్డి మంత్రి పదవి రాకపోవడంతో కీలక వ్యాఖ్యలు చేశారు.. క్షేత్రస్థాయిలో పార్టీకి పట్టు తగ్గిపోతోందని.. వాస్తవంగా ఏం జరుగుతుందో తెలుసుకునే బాధ్యతను అధిష్టానం చేయలేకపోతుందని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఒక రకంగా రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి.. అయితే ఆయన వేరే దారి చూసుకుంటారా? లేక మలి దశ విస్తరణలో మంత్రి పదవి దక్కించుకుంటారా అనేది చూడాల్సి ఉంది.
అధిష్టానం పై ఆగ్రహం
ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అధిష్టానం పై ఆగ్రహంగా ఉన్నారు. మంత్రి పదవి వస్తుందని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. ఢిల్లీ పెద్దలతో కూడా సంప్రదింపులు జరిపారు. శుభవార్త వస్తుంది అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో అధిష్టానం పై ఆయన ఒక రకమైన అసంతృప్తి భావనతో ఉన్నారు. తనను అధిష్టానం మంత్రి పదవికి పరిగణలోకి తీసుకోకపోవడం పట్ల తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మంత్రి పదవులు లభించిన వారు మాత్రం ఆనందంగా ఉన్నారు. తమ అనుచరులతో సంబరాలు జరుపుకుంటున్నారు.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.. ఇప్పటికే ఓ కీలక నాయకుడు ఢిల్లీ వెళ్ళిపోయారు.