CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు పరిపాలించిన కెసిఆర్ కాలంలో.. బంగారు తెలంగాణ అనే పదాన్ని విరివిగా వాడేవారు. తెలంగాణ రెండు కోట్ల మాగాణి అని పదే పదే వల్లే వేసేవారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏడాదిన్నరగా పరిపాలన సాగిస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అనేక హామీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ఇందులో ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యోగులు కోరుతుండడంతో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి.. వారితో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ని లెక్కలతో సహా వివరించారు.. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే అవకాశం ఇప్పట్లో లేదని రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తనకు కూడా ఉందని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వల్ల తాను కూడా ఏమీ చేయలేకపోతున్నానని రేవంత్ రెడ్డి తనని సహాయతను వ్యక్తం చేశారు.
Also Read :ఉద్యోగులకు కోలుకోలేని షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి
అప్ప కోసం వెళ్తే దొంగలాగా చూస్తున్నారు..
“అప్పు కోసం పోతే నన్ను దొంగలాగా చూస్తున్నారు. ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకు పోతాడేమోనని నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. నన్ను బజార్లో ఎవరూ నమ్మడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పు పుట్టడం లేదు. అప్పు పుడితేనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అది జరిగినప్పుడు చేయడానికి కూడా ఏమీ లేదు. నెలకు ప్రభుత్వానికి కొంతమేర మాత్రమే ఆదాయం వస్తోంది. వీటన్నింటిని వివిధ విభాగాలకు మళ్లించే వరకు సరిపోతుంది. కొత్తగా చేయాలంటే కూడా ఏమీ కనిపించడం లేదు. ఇలాంటి స్థితిలో కుటుంబ పెద్దగా నేను చెప్పేది ఒకటే.. గుట్టుగా సంసారం చేసుకుందాం. నడి బజార్లో పడి పరుగు పోగొట్టుకునే కంటే.. జాగ్రత్తగా ఉందాం. లేనిపక్షంలో అందరం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ప్రభుత్వం అంటే ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగులు కూడా. ముఖ్యమంత్రికి మాత్రమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బాధ్యత ఉండాలి. అప్పుడే ప్రభుత్వం సజావుగా నడుస్తుంది. ఉద్యోగులు ఆందోళన బాట పట్టి.. యుద్ధం చేస్తామని హెచ్చరిస్తే.. అంతిమంగా అది రాష్ట్రానికి నష్టం చేకూర్చుతుంది. సమ్మెల వల్ల, నిరసనల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.. మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుండగా.. ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు పెదవి విరుస్తున్నారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి.. ఇప్పుడు అమలు చేయకుండా ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటని వారు మండిపడుతున్నారు.
అప్పు కోసం పోతే నన్ను దొంగని చూసినట్టు చూస్తున్నారు
ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకు పోతాడేమో అని నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు
నన్ను ఎవరూ బజారులో నమ్మడం లేదు – రేవంత్ రెడ్డి pic.twitter.com/rb4MbLlSyW
— Telugu Scribe (@TeluguScribe) May 5, 2025