Balakrishna : నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కెరీర్ లో సువర్ణాక్షరాలతో లికించదగ్గ చిత్రాలలో ఒకటి ‘ఆదిత్య 369’. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం, ఆరోజుల్లో ఒక సెన్సేషన్. రొటీన్ కమర్షియల్ సినిమాలు రాజ్యం ఏలుతున్న రోజుల్లో, అందరి ఊహలకు అందని విధంగా, దేశం లోనే టైం మెషిన్ కాన్సెప్ట్ మీద తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం ఈ సినిమా ఆరోజుల్లో అరుదైన రికార్డుని నెలకొల్పింది. ఎన్ని తరాలు మారినా, ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. నేటి తరం ఆడియన్స్ లో మీకు బాగా ఇష్టమైన బాలకృష్ణ సినిమా ఏమిటి అని అడిగితే, నూటికి 90 శాతం మంది ‘ఆదిత్య 369’ పేరు ని చెప్తారు. ఏప్రిల్ నెలలో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసారు కానీ, జనాల్లోకి ప్రొమోషన్స్ ద్వారా బలంగా తీసుకొని వెళ్ళకపోవడం వల్ల మిశ్రమ స్పందన లభించింది.
Also Read : రేపటితో ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ పూర్తి..విడుదల తేదీపై వీడిన ఉత్కంఠ!
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఆదిత్య 999’ చిత్రం చెయ్యాలి అనేది బాలయ్య బాబు కోరిక. ఈ చిత్రాన్ని తన కొడుకు మోక్షజ్ఞ(Nandamuri Mokshagna) ని హీరో గా పెట్టి , తన సొంత దర్శకత్వం లో చెయ్యాలని అనుకున్నాడు. తన ప్రతీ కొత్త సినిమా విడుదలకు ముందు ఈ చిత్రం గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాడు కానీ, కార్య రూపం మాత్రం దాల్చడం లేదు. అందుకే ఈ సినిమాని తెరకెక్కించే బాధ్యత డైరెక్టర్ క్రిష్(Krish Jagarlamudi) చేతిలో బాలయ్య బాబు పెట్టినట్టు తెలుస్తుంది. బాలయ్య వందవ చిత్రం గా క్రిష్ తెరకెక్కించిన ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ మీద వీళ్ళ కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి కానీ, అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
అయినప్పటికీ తన డ్రీం ప్రాజెక్ట్ క్రిష్ మాత్రమే చేయగలడు అనే నమ్మకం ఇప్పటికీ బాలయ్య బాబులో ఉంది. అందుకే ఈ ప్రాజెక్టు ని ఆయన చేతిలో పెడుతున్నాడు. ఇందులో మోక్షజ్ఞ తో పాటు బాలయ్య బాబు కూడా నటించబోతున్నాడు. ప్రస్తుతం బాలయ్య ‘అఖండ 2’ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. జూన్ 10వ తేదీన ఆయన గోపీచంద్ మలినేని తో ఒక సినిమాని ప్రారంభించబోతున్నాడు. ఈ చిత్రం ఆగష్టు నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకునే అవకాశం ఉన్నది. ఈ చిత్రం తో పాటు సమాంతరంగా ‘ఆదిత్య 999’ మూవీ షూటింగ్ కూడా చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నాడు బాలకృష్ణ. ఈ సినిమాని అనుకున్న విధంగా కరెక్ట్ గా తీస్తే ,హైప్ విషయం లో లేటెస్ట్ పాన్ ఇండియన్ హీరోల సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.