SRH VS DC : ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో సోమవారం ఓన్ గ్రౌండ్ లో సాగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సొంత మైదానంలో హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకోవడం అందరిని ఆశ్చర్యపరచింది. హైదరాబాద్ కెప్టెన్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని చాలామంది అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాకపోతే వారందరి అభిప్రాయం తప్పని హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ నిరూపించాడు. ఢిల్లీ జట్టుకు చుక్కలు చూపించాడు. తనకు మాత్రమే సాధ్యమైన పదునైన బంతులు వేస్తూ ఢిల్లీ జట్టును వణికించాడు. గొప్ప గొప్ప జట్లను సైతం ఓడించి బలంగా కనిపిస్తున్న ఢిల్లీని పసికూనను చేశాడు కమిన్స్. ఇన్నాళ్లు తను వదిలేసిన లయను ఒక్కసారిగా అందుకున్నాడు. సొంత మైదానంలో కట్టుదిట్టంగా బంతులు వేస్తూ ఢిల్లీ జట్టుకు కోలుకోలేని షాకిచ్చాడు.
0 పరుగులకే వికెట్
హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో.. బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు ఖాతా తెరవకముందే కరుణ్ నాయర్(0) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత డూ ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, విప్రజ్ నిగం ఇలా వికెట్లు పటాపటా పడిపోవడంతో ఢిల్లీ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే కీలకమైన వికెట్లు తీయడం ద్వారా హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ సరికొత్త రికార్డు సృష్టించాడు. కెప్టెన్ గా 1-6 ఓవర్లలో రెండు కంటే వికెట్లు తీసిన కెప్టెన్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా, కమిన్స్ తీసిన మూడు వికెట్లకు సంబంధించి క్యాచ్ లను ఇషాన్ కిషన్ పట్టడం విశేషం.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో హైదారబాద్ కెప్టెన్ కమిన్స్ 12 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.
2025లో బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ పది పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
2017లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ జహీర్ ఖాన్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో 13 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు
2008లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ షాన్ పోలాక్ కోల్ కతా వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 13 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
2017లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ జహీర్ ఖాన్ పూణే జట్టుతో పూణే వేదికగా జరిగిన మ్యాచ్లో 14 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
2016లో ఢిల్లీ జట్టు కెప్టెన్ జహీర్ ఖాన్ ఢిల్లీ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
2017లో పూణే జట్టుతో పూణే వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ 19 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
Pat-attack at Uppal pic.twitter.com/iktMJXWGmg
— SunRisers Hyderabad (@SunRisers) May 5, 2025