HomeతెలంగాణCM Revanth Reddy: గురుకులాలు క్లోజ్‌.. రేవంత్‌ వ్యాఖ్యల మర్మం అదేనా?

CM Revanth Reddy: గురుకులాలు క్లోజ్‌.. రేవంత్‌ వ్యాఖ్యల మర్మం అదేనా?

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ.. విద్యార్థుల చదువు కోసం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసింది. కులాలు, మతాల ప్రాతిపదికన వీటిని ఏర్పాటు చేసింది. బీసీ, ఎస్సీ, మైనారిటీ గురుకులాల పేరుతో సుమారు వెయ్యికిపైగా గురుకులాలు ఏర్పాటు చేశారు. ఉచిత విద్యా, భోజనంతోపాటు వసతి కూడా కల్పిస్తుండడంతో గురుకులాలకు ఆదరణ పెరిగింది. అడ్మిషన్లకు పోటీ పడుతున్నారు విద్యార్థులు. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రభుత్వం అడ్మిషన్లు కల్పిస్తోంది.

ఇంటర్‌ వరకు విద్య..
ఇక గురుకులాల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఉచితంగా విద్య అందుతోంది. ఆరో తరగతిలో చేరిన విద్యార్థులు ఉచితంగా ఇంటర్‌ వరకు చదివే అవకాశం ఉంది. పుస్తకాలు, యూనిఫాంలు, భోజనంతోపాటు ఉయదం టిఫిన్స్, సాయంత్రం స్నాక్స్‌ ఇలా రుచికమైన భోజనం కూడా పెడుతున్నారు. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక పిల్లలు ఫోన్లకు ఎడిక్ట్‌ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లలను గురుకులాల్లో చేర్పిస్తున్నారు. బాలికలు, బాలురకు కూడా వేర్వేరుగా హాస్టల్స్‌ ఉండడం, నిపుణులైన ఉపాధ్యాయులు ఉండంతో గురుకులాల విద్యార్థులు ఫలితాల్లోనూ సత్తా చాటుతున్నారు.

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో ఆందోళన..
ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం గురుకులాలపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పిల్లలను గురుకులాల్లో చేర్పించడం వలన పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఈమేరకు ఇటీవల ఓ నివేదిక అందిందని వెల్లడించారు. తద్వారా పిల్లలను చిన్నప్పుడే గురుకులాల్లో చేర్పించడం మంచిది కాదు అని పేర్కొన్నారు. దీంతో రేవంత్‌ సర్కార్‌ గురుకులాలను మూసివేస్తుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కొందరు ఎత్తివేయకపోవచ్చు కాని, ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పించకుండా 8వ తరగతిలో కల్పిస్తారని కొందరు పేర్కొంటున్నారు.

స్పందిస్తున్న నెటిజన్లు..
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. పేదలకు వరంగా ఉన్న గురుకులాలను ఎత్తివేయొద్దని కోరుతన్నారు. కేసీఆర్‌ మీద కోపంతో పిల్లల భవిష్యత్‌తో ఆడుకోవద్దని కొందరు సూచిస్తున్నారు. గురుకులాలు ఎత్తేయాలని ఆలోచన చేస్తున్నారా అని చాలా మంది ప్రశ్నించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version