Sankranti 2027 movie releases: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో మన స్టార్ హీరోలు వరుస సక్సెస్ లను సాధిస్తుండడం విశేషం… ఇప్పటివరకు మనవాళ్లు పాన్ ఇండియాలో క్రియేట్ చేసిన రికార్డులను తిరగరాసే హీరోలు ఎవరు లేకపోవడంతో ఇండియా వైడ్ గా మన హవానే ఎక్కువగా కొనసాగుతుంది. ఇక రాబోయే సినిమాలతో కూడా మన స్టార్ హీరోలందరు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నారు… ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగ అనేది చాలా పెద్ద పండుగ ప్రేక్షకులందరు పండగపూట సినిమాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి సంక్రాంతి పండుగకు పెద్ద మొత్తంలో సినిమాలైతే రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ సంవత్సరం సంక్రాంతికి ఐదు సినిమాలు రిలీజ్ అయితే ఐదు సినిమాలకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే వచ్చే ఏడాది బరిలో నిలువబోతున్న సినిమాలేంటి అనే ధోరణి లో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి – బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందట. ఇక అనిల్ రావిపూడి -వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో చేస్తున్న మల్టీస్టారర్ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుంది. ఇక బాలయ్య బాబు – గోపీచంద్ కాంబోలో వస్తున్న సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలవడం విశేషం…
నాగార్జున తన వందో సినిమాని సైతం సంక్రాంతి బరిలోనే నిలపాలని చూస్తున్నారట. మొత్తానికైతే ఈ నలుగురు సీనియర్ హీరోలు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలబడుతున్నారు. ఇక వీళ్లతో పాటుగా మరి కొంతమంది హీరోలు కూడా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…
ఫైనల్ గా ఈ హీరోలతో పాటు విజయ్ దేవరకొండ కూడా తన రౌడీ జనార్ధన్ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది… మొత్తానికైతే ఏ సినిమా సక్సెస్ఫుల్ టాక్ ను సంపాదించుకుంటుందో ఆ సినిమా సంక్రాంతి సీజన్ లో ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సక్సెస్ ని సాధించి ఈ ఏడాది ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న అనిల్ రావిపూడి సైతం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉండటం ప్రతి ఒక్కరిని ఆనందపరుస్తుంది. ఎందుకంటే అతని సినిమాలు మినిమం గ్యారంటీగా ఉంటాయి. కాబట్టి ఒక్కసారైనా చూడొచ్చు అనే ఉద్దేశ్యంతోనే ప్రేక్షకులు సైతం ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు…
