CM Revanth Reddy: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. ఇది ఎవరూ కాదనలేని నిజం. కానీ బీజేపీ స్వయంకృతాపరాధం.. అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను తప్పించడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. అప్పటి వరకు రేసులో కూడా లేని హస్తం పార్టీని టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంతరెడ్డి బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనేలా పార్టీకి జోష్ తెచ్చారు. అయినా బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ ఓడిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అందరి అనుమానాలను పటాపంచలు చేసి.. అధికారంలోకి వచ్చింది. ఇందులో రేవంత్‌రెడ్డి పాత్ర ఎవరూ కాదనలేనిది. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా లేకుంటే కేసీఆర్‌ను ఓడించేవారం కాదని ఆ పార్టీ సీనియన్ నేతలే పేర్కొనడం ఇందుకు నిదర్శనం.
పదవి వద్దంతున్న రేవంత్..
మూడేళ్ల 6కితం టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి.. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే పీసీసీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధిష్టానం రేవంత్ సారథ్యంలోనే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. దీంతో పదవీకాలం పూర్తయ్యాక కూడా రేవంత్‌రెడ్డే ఇటు సీఎంగా, అటు టీపీసీసీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలిపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాలనపైనే పూర్తి దృష్టి పెట్టాలనుకుంటున్న సీఎం.. పీసీసీ పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నారు. ఈమేరకు తనను తప్పించాలని అధిష్టానాన్ని కోరారు. ఈమేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతోపాటు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా మీడియాకు తెలిపారు.
రేవంత్ వారసుడి కోసం వేట..
జూలై 7వ తేదీతో పీసీసీ చీఫ్‌గా రేవంత్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతలు పొడిగించకుండా కొత్తవారిని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్నందున పీసీసీ పదవి మరొకరికి ఇవ్వాలని హస్తం పెద్దలు ఆలోచిస్తున్నారు. ఈమేరకు రేవంత్ వారసుడి కోసం కసరత్తు చేస్తున్నారు.
అధిష్టానానికి వారసుడి పేర్ల..
ఇదిలా ఉంటే.. పీసీసీ చీఫ్‌గా తన తర్వాత ఎవరు ఉండాలన్న విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధిష్టానానికి కొన్ని చూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు కొన్ని పేర్లను కూడా ఆయన అధిష్టానానికి అందజేశారని సమాచారం. వీటితోపాటు రాష్ట్రంలోని సీనియర్ నాయకుల నుంచి కూడా ఏఐసీసీ వివరాలు సేకరించే అవకాశం ఉంది. స్థానిక నేతల అభిప్రాయం, సీఎం రేవంత్ సూచనలు అన్నీ క్రోడీకరించి జూలై 10వ తేదీలోకా టీపీసీసీకి కొత్త సారథిని నియమించే అవకాశం ఉంది. సీఎంగా రెడ్డి సామాజికవర్గ నేత ఉన్నందున పీపీసీ పగ్గాలు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.