NRI Couple: ఎన్నారై జంటకు జైలు.. నమ్మించి మోసం చేసిన ఫలితం!

అమెరికా అటార్నీ తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో హర్మన్‌ప్రీత్‌సింగ్, అతడి భార్య కుల్బీర కౌర్‌ దంపతులు. బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని తమ బంధువైన కుర్రాడిని మంచి చదువు, మంచి జీవితం అని తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అమెరికా తీసుకొచ్చారు.

Written By: Raj Shekar, Updated On : June 27, 2024 3:50 pm

NRI Couple

Follow us on

NRI Couple: భారతీయ అమెరికన్‌ జంటకు అమెరికా కోర్టు షాక్‌ ఇచ్చింది. పై చదువులు చెప్పిస్తామని నమ్మించి మైనర్లను అమెరికాకు తీసుకువచ్చి అమానుషంగా ప్రవర్తించిన నేరానికి జైలు శిక్షతోపాటు, భారీగా జరిమానా విధించింది. బాధితుడికి రూ.1.8 కోట్ల పరిహారం చెల్లించాలని తీరుప ఇచ్చింది.

ఏం జరిగిందంటే..
అమెరికా అటార్నీ తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో హర్మన్‌ప్రీత్‌సింగ్, అతడి భార్య కుల్బీర కౌర్‌ దంపతులు. బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని తమ బంధువైన కుర్రాడిని మంచి చదువు, మంచి జీవితం అని తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అమెరికా తీసుకొచ్చారు. అతడి డాక్యుమెంట్లు లాక్కుని వేధించడం మొదలు పెట్టారు. వర్జీనియాలోని తమ గ్యాస్‌ స్టేషన్, కన్వీనియన్స్‌ స్టోర్‌లో తక్కువ జీతానికి పనికి నియమించి వెట్టి చాకిరీ చేయించారు. ఇంటిపని, వంటపని, షాపులో నగదు రిజిస్టర్లు, స్టోర్‌ రికార్డులపని ఇలా రోజుకు 12 నుంచి 17 గంటలపాటు పనిచేయించారు. కడుపు నిండా అన్నం కూడా పెట్టేవారు కాదు.

వీసా గడవు ముగిసినా..
ఇక కుర్రాడి వీసా గడువు ముగిసినా ఇండియాకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. తన ఇమ్మిగ్రేషన్‌ పత్రాలు ఇవ్వమని అడిగితే తీవ్రంగా కొట్టేవారు. సెలవు అడిగితే తుపాకితో చంపుతామని బెదిరించారు. చివరకు కుటుంబ ఆస్తులు లాగేసుకుంటామని, తప్పుడు కేసులు పెడతామని బెదిరించారు.

ఫిర్యాదుతో కేసు..
ఎలాగో ఒకలా సదరు బాధితుడు పోలీసుల ద్వారా కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన న్యాయస్థానం హర్మన్‌ప్రీత్‌సింగ్, కుల్బీర కౌర్‌ దంపతులు నమ్మించి, యూఎస్‌కు రప్పించి, ఇమ్మిగ్రేషన్‌ పత్రాలు లాక్కుని తక్కువ వేతనంలో పనిలో పెట్టుకుని ఎక్కువ గంటలు పనిచేయించినట్లు నిర్ధారణ అయింది. శారీరకంగా, మానసికంగా వేధించినట్లు అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌ క్రిస్టెన్‌ క్లార్క్‌ నిరూపించారు. దీంతో కోర్టు హర్మన్‌ ప్రీత్‌సింగ్‌కు రూ.11.25 ఏళ్లు, అతని భార కుల్బీర్‌ కౌర్‌కు 7.25 ఏళ్ల జైలుశిక్ష విధించింది. బాధితుడికి భారీగా పరిహారం చెల్లించాలని ఆదేశించింది.