BRS MLC Kavitha Statement: ఇంటింటికీ మట్టి పొయ్యే.. కాకపోతే దానిని ఎలా వాడుకోవాలో మనకు తెలిసి ఉండాలి.. లేకపోతే మన మట్టి వాసన పోరుగింటి వారికి తెలుస్తుంది. మనుషుల జీవితాలకే కాదు.. మనుషులు చేసే రాజకీయాలకు కూడా పై ఉపోద్ఘాతం వర్తిస్తుంది. సరిగా ఇదే విషయాన్ని జాగృతి అధినేత్రి, భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
Also Read: రాఖీ వద్దన్నందుకు.. కేటీఆర్ పైకి కవిత సింగరేణి అస్త్రం!
కల్వకుంట్ల కవిత కొంతకాలంగా భారత రాష్ట్ర సమితికి దూరంగా ఉంటున్నారు. ఆ విషయాన్ని ఆమె ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. విభేదాలు ఎందుకు వచ్చాయి? ఎలా వచ్చాయి? దీనికి కారణం ఎవరు? ఈ సమస్యను ఎవరు పరిష్కరించాలి? పరిష్కరించేంతవరకు తన ఏం చేస్తారు? అనే విషయాలపై కల్వకుంట్ల కవిత ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తూనే ఉన్నారు. పైగా విలేకరులు అడిగే ప్రతి ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెబుతూనే ఉన్నారు.
కల్వకుంట్ల కవిత సింగరేణి లో పనిచేస్తున్న కార్మిక సంఘాల నాయకులతో భేటీ నిర్వహించారు. గతంలో ఆమె భారత రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉన్న సింగరేణి కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆస్థానాన్ని భారత రాష్ట్ర సమితి కొప్పుల ఈశ్వర్ తో భర్తీ చేసింది. ఈ నేపథ్యంలోనే సింగరేణి సమస్యలపై కవిత తన వైఖరి వెల్లడించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను విలేకరుల ఎదుట ప్రస్తావించారు.
ఈ సందర్భంలోనే తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని కూడా ఆమె ఆవిష్కరించారు. అన్ని పార్టీలలో విభేదాలు ఉన్నాయని.. కేవలం భారత రాష్ట్ర సమితిలో జరుగుతున్న విషయాలను భూతద్దం పెట్టుకొని మీడియా చూస్తోందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు..” కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతారు.. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తారు. భారతీయ జనతా పార్టీలో రాజాసింగ్ లాంటి వ్యక్తులు అధ్యక్షుడికి, అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారు.. ఈటల రాజేందర్, బండి సంజయ్ నువ్వా నేనా అన్నట్టుగా విమర్శలు చేసుకుంటారు. ఆ విషయాలను మీడియా పట్టించుకోదు. మీడియా పెద్దగా ఫోకస్ చేయదు. కేవలం భారత రాష్ట్ర సమితి వ్యవహారాలను మాత్రమే మీడియా పట్టించుకుంటుంది. అన్ని పార్టీలలోను విభేదాలు ఉన్నాయి. అన్నిచోట్లా వివాదాలు ఉన్నాయి. పార్టీలో ఇవన్నీ సర్వసాధారణం. ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంటాయని” కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు.
Also Read: భాగ్యనగరం బాధలు తీరేదెప్పుడు?
సింగరేణిలో కార్మిక సంఘం నాయకులతో భేటీ నిర్వహించడం వెనుక కవిత ఉద్దేశం ఏమిటి.. కవిత ఏమైనా కొత్త సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారా.. లేదా సింగరేణిలో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా.. తన ప్రాబల్యాన్ని భారత రాష్ట్ర సమితి అధిష్టానం ఎదుట ప్రదర్శిస్తున్నారా.. అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బీఆర్ఎస్ లోనే కాదు అన్ని పార్టీల్లో విభేదాలు ఉన్నాయి: ఎమ్మెల్సీ కవిత
సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడితే అరగటంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండిస్తారు
బండి సంజయ్ కి ఈటల డైరెక్ట్ గానే వార్నింగ్ ఇస్తారు
అన్నీ పార్టీల్లో ఏదో ఒకటి నడుస్తోంది
బీఆర్ఎస్ పై ప్రత్యేకంగా ఫోకస్… pic.twitter.com/kncqy7hiU4
— BIG TV Breaking News (@bigtvtelugu) August 10, 2025