Kakori Train Robbery : ఆగస్టు 9, 1925.. భారత స్వాతంత్ర్య ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. కాకోరి రైలు దోపిడీ.. అప్పట్లోనే 4,600 రూపాయల దోపిడీ.. బాండ్లు దోచేశారు. రైలును ఆపి.. డ్రైవర్, గార్డును ఇద్దరినీ బెదిరించి డబ్బులను దోచుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ఇది కేవలం రైలు దోపిడీ కాదు. విప్లవకారులు సాగించిన వీరోచిత సాహస చర్య ఇదీ. దీనికి 100 సంవత్సరాలు పూర్తయ్యింది. ఆ సందర్భంగా యూపీ ప్రభుత్వం దీన్ని ఘనంగా జరుపుతోంది.
యూపీ ప్రభుత్వం అయితే కాకోరి రైలు గురించి ఒక గొప్ప కార్యక్రమం నిర్వహిస్తోంది. పుస్తకాల్లో తప్పుడు రాతలు రాశారు. ఈ సంఘటనలో నలుగురు విప్లవకారులు ఉరికంభం ఎక్కారు. మరో నలుగురు అండమాన్ లో జీవిత ఖైదు అనుభవించారు.
భగత్ సింగ్ సహా ఎంతో మంది విప్లవకారులు ఉన్నా.. కాకోరి ఘటన ఉద్యమకారుల చరిత్ర మాత్రం మరుగునపడింది.
వీరోచిత కాకోరి రైలు దోపిడీ జరిగి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా ఆనాడు జరిగిన ఘటనలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..
