BJP: శత్రుశేషం మిగలకుండా.. బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేసిన బీజేపీ.. రంగంలోకి ఈటల

BJP: కేంద్ర మంత్రివర్గంలో ఈటలకు కచ్చితంగా స్థానం దక్కుతుందని అంతా భావించారు. కానీ, పార్టీ విధేయులకు ప్రాధాన్యం ఇచ్చారు మోదీ. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు కేంద్ర మంత్రిర్గంలో స్థానం కలించారు.

Written By: Raj Shekar, Updated On : June 10, 2024 11:56 am

BJP targeted BRS

Follow us on

Telangana: చచ్చిన పామును ఇంకా చంపడం ఎందుకని వదిలేస్తాం.. కానీ, కొందరు శత్రుశేషం మిగలకూడాదని భావిస్తారు. బీఆర్‌ఎస్‌ విషయంలో బీజేపీ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. మోదీ శత్రువుగా భావించేవారిని వదిలి పెట్టరు అని విపక్షాలే ఆరోపిస్తుంటాయి. తెలంగాణలో బద్ధ శత్రువుగా భావిస్తున్న బీఆర్‌ఎస్‌ను పూర్తిగా తుడిచి పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే తన టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ను ఐదేళ్లలో బలహీనపర్చడమే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ పగ్గాలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Also Read: Dharmapuri Arvind : ఆరవింద్‌కు ఆశాభంగం.. కేంద్ర కేబినెట్‌లో దక్కని ఛాన్స్‌..

పార్టీకి ఈటల సేవలు..
కేంద్ర మంత్రివర్గంలో ఈటలకు కచ్చితంగా స్థానం దక్కుతుందని అంతా భావించారు. కానీ, పార్టీ విధేయులకు ప్రాధాన్యం ఇచ్చారు మోదీ. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు కేంద్ర మంత్రిర్గంలో స్థానం కలించారు. ఈ క్రమంలో సీనియర్‌ నేతల ఈటల రాజేందర్‌ సేవలను పార్టీకి వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు.. తన శత్రు పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ను బలహీనపర్చాలని భావిస్తోంది. ఈటల నాయకత్వంలో బీఆర్‌ఎస్‌కు దీటుగా తెలంగాణలో బీజేపీ బలపడుతుందని కమలనాథులు భావిస్తున్నారు.

Also Read: Telangana BJP : కిషన్ రెడ్డి, సంజయ్ ఇద్దరూ కేంద్రానికి వెళితే, తెలంగాణ బీజేపీ పగ్గాలు ఎవరికి?

సామాజిక కోణంలో..
ఇక తెలంగాణలో బీసీ జపం చేస్తోన్న బీజేపీ ఈటలను అధ్యక్షుడిగా నియమించడంతో ద్వారా బీసీల ఓటు బ్యాంకు కూడా పెరుగుతుందని అంచా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, బీఆర్‌ఎస్‌లోని కీలక నేతలతో ఈటలకు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి. గులాబీ పార్టీ తెలంగాణలో రోజురోజుకు బలహీనపడుతుండటంతో అందులోని బలమైన నేతలను బీజేపీలో చేర్చుకుని గులాబీ పార్టీ స్థానంలో బీజేపీని నిలపాలను ప్లాన్‌ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈటలను స్టేట్‌ చీఫ్‌ గా నియమించడం వలన పార్టీకి బలమైన నాయకత్వంతోపాటు బీఆర్‌ఎస్‌ను బలహీనపర్చవచ్చనేది కమలనాథుల ప్లాన్‌గా తెలుస్తోంది.