Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గెలుపును సెలబ్రేట్ చేసుకోలేకపోయిన అల్లు అర్జున్… కారణం ఏంటంటే..?

Pawan Kalyan: మెగా ఫ్యామిలీ హీరో అయిన అల్లు అర్జున్ వైసిపి పార్టీ తరఫున నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన శిల్పా రవి చంద్రారెడ్డి కి మద్దతుగా తను ప్రచారాన్ని నిర్వహించాడు.

Written By: Gopi, Updated On : June 10, 2024 12:00 pm

Allu Arjun was unable to celebrate Pawan Kalyan win

Follow us on

Pawan Kalyan: మెగా ఫ్యామిలీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పది సంవత్సరాలు పూర్తి అయింది. అయితే ఇంతకు ముందు వరకు ఆయన సక్సెస్ సాధించింది అయితే లేదు. కానీ రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తా చాటడమే కాకుండా తన పార్టీ మెంబర్లందరిని గెలిపించుకొని జనసేన పార్టీకి జనంలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రతి ఒక్కరికి తెలిసేలా చేశాడు.

ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఎలక్షన్ల సమయంలో మెగా ఫ్యామిలీ హీరో అయిన అల్లు అర్జున్ వైసిపి పార్టీ తరఫున నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన శిల్పా రవి చంద్రారెడ్డి కి మద్దతుగా తను ప్రచారాన్ని నిర్వహించాడు. ఇక దీనివల్ల పవన్ కళ్యాణ్ అభిమానులనే కాకుండా ఆంధ్రప్రదేశ్ జనాల దృష్టిలో కూడా అల్లు అర్జున్ చాలా వరకు నెగిటివ్ ఇంప్రెషన్ ని మూటగట్టుకున్నాడు. ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ ప్రచారం చేసిన కూడా అక్కడ ఆయన గెలవలేకపోయాడు.

Also Read: Pushpa 2: పుష్ప 2 మీద కొనసాగుతున్న నెగిటివ్ ప్రచారం…కారణం ఏంటంటే..?

ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గెలుపును మెగా ఫ్యామిలీ అంతా భారీగా సెలబ్రేట్ చేసుకుంటే అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ ని కలిసినట్టుగా గాని, ఆయనతో సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నట్టుగా గానీ ఒక వీడియో గానీ, ఒక ఫోటో గానీ బయటికి అయితే రాలేదు. అయితే పవన్ కళ్యాణ్ గెలిచినందుకు తను సంతోషిస్తున్నట్టుగా ఒక ట్వీట్ అయితే చేశాడు.

Also Read: Ram Pothineni: జగన్ నీ మీద కుట్ర జరుగుతుంది… సంచలనం రేపుతున్న హీరో రామ్ పోతినేని పోస్ట్!

అంతే తప్ప పవన్ కళ్యాణ్ ని కలవడం గానీ అతనికి కంగ్రాచ్యూలేషన్స్ చెప్పడం గాని జరగలేదు. మరి ఎందుకు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటున్నాడు అనే విషయాలైతే ఎవరికి తెలియడం లేదు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలవడమే కాకుండా పొలిటికల్ గా కూడా తనను కొట్టేవారు మరొకరు లేరు అనేంతలా ఈ ఎన్నికల్లో తన సత్తా చూపించాడు…ఇక వైసిపి పార్టీ కి నామ రూపాలు లేకుండా చేశాడు…