Bandi Sanjay Sensational Comments: తెలంగాణ రాజకీయాలలో సెన్సేషనల్ పొలిటికల్ లీడర్ గా బండి సంజయ్ కి పేరు ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. భారత రాష్ట్ర సమితికిపట్టున్న కరీంనగర్ పార్లమెంటు స్థానంలో వరుసగా రెండు సార్లు విజయం సాధించి సంచలనం సృష్టించారు బండి సంజయ్. మొదట్లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత రెండవ పర్యాయం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు.
బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేయడంలో దిట్ట.. ఏ విషయమైనా సరే ఆయన కుండ బద్దలు కొడుతుంటారు. తన మనసులో దాచుకోకుండా అసలు విషయాన్ని చెబుతుంటారు. అందువల్లే ఆయనను బిజెపిలో ఫైర్ బ్రాండ్ లీడర్ అని పిలుస్తుంటారు. ఆ ఫైర్ వల్లే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అప్పటి భారత రాష్ట్ర సమితి చుక్కలు చూపించింది. 2023 ఎన్నికల్లో బండి సంజయ్ ని భారతీయ జనతా పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తప్పించింది. ఒకవేళ బండి సంజయ్ గనుక అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఫలితాలు మరో విధంగా వచ్చేవని ఇప్పటికి రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ బండి సంజయ్ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తన తడాఖా చూపించారు.
Also Read: హైదరాబాదులో మాటలకందని విషాదం.. కృష్ణాష్టమి వేడుకల్లో కనీ వినీ ఎరుగని ఘోరం!
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో.. సంచలన విషయాలను వెల్లడించడంలో బండి ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన.. రాష్ట్రీయ స్వయసేవక్ సంఘ్ లో తను పనిచేసిన సమయంలో అనుభవాలను పంచుకున్నారు. తనకు ఎదురైన ఇబ్బందులను వెల్లడించారు. ఒకానొక సందర్భంలో తనకు ప్రాణాపాయం ఎదురైనప్పుడు.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కాపాడారని గుర్తు చేసుకున్నారు. వైయస్ జగన్ తనకు రక్షణగా నిలిచారని పేర్కొన్నారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. అంతేకాదు వైసిపి అభిమానులకు కూడా ఆయుధం లాగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి జనసేన, టిడిపి తో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచింది. అయితే బిజెపిలో ఉన్న సంజయ్ జగన్ తన ప్రాణాలు కాపాడాడని చెప్పడం విశేషం.
ఆరోజు నా ప్రాణాలను కాపాడింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
– కేంద్ర మంత్రి బండి సంజయ్ pic.twitter.com/urY3fx5drs
— Telugu Feed (@Telugufeedsite) August 18, 2025