https://oktelugu.com/

నారాయణ విమర్శలకు రోజా కౌంటర్‌‌

వైసీపీ ఫైర్‌‌ బ్రాండ్‌ ఆర్కే రోజా. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్‌‌ ఇవ్వడంలో ఆమెకు ఆమె సాటి. ఒక విధంగా చెప్పాలంటే మొదట్లో వైసీపీలో కౌంటర్‌‌ ఇవ్వదగిన నేత అంబటి రాయుడు తర్వాత ఆమె అని చెప్పాలి. ఇప్పుడు రోజా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణపై విరుచుకుపడ్డారు. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గానికి నారాయ‌ణ త‌ల‌వంపులు తెస్తున్నార‌ని ఆమె విమ‌ర్శించారు. Also Read: ఆలూ లేదు.. సూలూ లేదు.. కానీ అప్పుడే నామకరణం నారాయణ స్వగ్రామం రోజా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న న‌గ‌రి […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 29, 2020 / 03:22 PM IST
    Follow us on


    వైసీపీ ఫైర్‌‌ బ్రాండ్‌ ఆర్కే రోజా. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్‌‌ ఇవ్వడంలో ఆమెకు ఆమె సాటి. ఒక విధంగా చెప్పాలంటే మొదట్లో వైసీపీలో కౌంటర్‌‌ ఇవ్వదగిన నేత అంబటి రాయుడు తర్వాత ఆమె అని చెప్పాలి. ఇప్పుడు రోజా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణపై విరుచుకుపడ్డారు. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గానికి నారాయ‌ణ త‌ల‌వంపులు తెస్తున్నార‌ని ఆమె విమ‌ర్శించారు.

    Also Read: ఆలూ లేదు.. సూలూ లేదు.. కానీ అప్పుడే నామకరణం

    నారాయణ స్వగ్రామం రోజా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోనిదే. గ్రామాల్లో 1.50 సెంటు, ప‌ట్టణాల్లో ఒక సెంటు స్థలాన్ని పేద‌ల‌కు పంచుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. పేద‌ల‌కు త‌క్కువ ఇంటి స్థలాన్ని పంపిణీ చేయ‌డంపై నారాయ‌ణ విమర్శలు చేశారు. సీఎం జ‌గ‌న్ ఇంట్లో కుక్కలను క‌ట్టేసేంత స్థలం కూడా పేద ప్రజ‌ల‌కు ఇవ్వడం లేద‌ని నారాయ‌ణ చేసిన ఘాటు విమ‌ర్శలు చేశారు.

    వీటిపై రోజా అంతే తీవ్రంగా స్పందించారు. క‌మ్యూనిస్టులు ధ‌ర్నాలు చేయ‌కుండానే ముఖ్యమంత్రి ఇంటి ప‌ట్టాలు ఇస్తున్నార‌ని రోజా అన్నారు. అసలు త‌న స్వస్థల‌మైన నగరికి నారాయ‌ణ ఏం చేశారని ఆమె గ‌ట్టిగా ప్రశ్నించారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న రాజ‌కీయ పార్టీకి రోజా స‌రికొత్త నిర్వచ‌నం చెప్పుకొచ్చారు.

    Also Read: ఆయనే ఓ పెద్ద బోడిలింగం..: పవన్‌పై కొడాలి ఫైర్‌‌

    అంతేకాదు.. సీపీఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని అందరికీ తెలుసునని.. కానీ దాన్ని చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ ఇండియాగా నారాయణ మార్చేశారని ఘాటుగా విమర్శించారు రోజా. మొత్తానికి నారాయణ విమర్శలకు రోజా గట్టి పంచ్‌ ఇచ్చినట్లుగానే అందరిలోనూ వినిపిస్తున్న మాట. అటు సోషల్‌ మీడియాలోనూ రోజా సెటైర్లు పెద్ద ఎత్తున వైరల్‌ అవుతున్నాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్