
దుబ్బాకలో 10రౌండ్లు పూర్తయ్యే సరికి మొత్తంగా బీజేపీ లీడింగ్ లోనే ఉంది. మొదటి రౌండ్ నుంచి బీజేపీ వేలల్లో ఆధిక్యత కొనసాగిస్తోంది. 1,2,3,4,5,8,9 రౌండ్లలో బీజేపీ ఆధిక్యత కొనసాగించగా 6,7,10వ రౌండ్ల లో టీఆర్ఎస్ స్వల్ప మెజారిటీ సాధించింది. కాగా రౌండ్ రౌండ్ కు ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ,టీఆర్ఎస్ నువ్వా, నేనా అన్నట్లు సాగుతోంది. కాంగ్రెస్ మాత్రం ఉనికి కోల్పోయినట్లేనని తెలుస్తోంది.
10 రౌండ్ల వారీగా ఆయా పార్టీలకు వచ్చిన ఫలితాలు..

10 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 3,734 ఆధిక్యంలో ఉన్నారు.