https://oktelugu.com/

జగన్‌ వెంట పడుతున్న ఈడీ

అక్రమాస్తుల కేసుల విషయంలో ఇప్పటికే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జైలు జీవితం అనుభవించారు. మనీలాండరింగ్‌తోపాటు పలు మనీ చట్టాల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆయన కేసులు నమోదు చేసింది. చాలావరకు ఆస్తులు కూడా అటాచ్‌ చేసింది. అటాచ్ చేసిన ఆస్తులను గతేడాది చాలా వరకు మినహాయింపు కూడా ఇచ్చింది. Also Read: పోలవరంపై కేంద్రం మెలిక..జగన్ ఆశలు అడియాశలు.. అయితే తాజాగా.. ఈడీ మరోసారి పట్టుబిగుస్తున్నట్లు కనిపిస్తోంది. తమ కేసులు విడిగా విచారణ చేయాల్సిందేనని పట్టుబడుతోంది. సీబీఐ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 10, 2020 1:53 pm
    Follow us on

    CM Jagan

    అక్రమాస్తుల కేసుల విషయంలో ఇప్పటికే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జైలు జీవితం అనుభవించారు. మనీలాండరింగ్‌తోపాటు పలు మనీ చట్టాల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆయన కేసులు నమోదు చేసింది. చాలావరకు ఆస్తులు కూడా అటాచ్‌ చేసింది. అటాచ్ చేసిన ఆస్తులను గతేడాది చాలా వరకు మినహాయింపు కూడా ఇచ్చింది.

    Also Read: పోలవరంపై కేంద్రం మెలిక..జగన్ ఆశలు అడియాశలు..

    అయితే తాజాగా.. ఈడీ మరోసారి పట్టుబిగుస్తున్నట్లు కనిపిస్తోంది. తమ కేసులు విడిగా విచారణ చేయాల్సిందేనని పట్టుబడుతోంది. సీబీఐ కేసులతో సంబంధం లేదని వాదిస్తోంది. ఈడీ చార్జిషీట్లు వేరుగా విచారణ జరపొచ్చని.. గతంలో వివిధ కోర్టులు ఇచ్చిన పలు తీర్పులను ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు.

    Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు..?

    ఇప్పటికే సీబీఐ కేసులు తేలిన తర్వాత ఈడీ కేసుల విచారణ చేపట్టాలని జగన్‌ పిటిషన్ వేశారు. ఒకవేళ సీబీఐ కేసులు కొట్టి వేస్తే ఆటోమేటిక్‌గా ఈడీ కేసులు కూడా రద్దవుతాయని జగన్ లాయర్ చెప్పుకొచ్చారు. సీబీఐ వేసిన చార్జిషీట్ల ఆధారంగానే కేసు పెట్టారనే లాజిక్ వినిపించారు. అయితే.. సీబీఐ కేసులు వేరు, ఈడీ కేసులు వేరని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తరఫు లాయర్లు స్పష్టం చేశారు. జగన్ తరపు లాయర్ వాదనపై మొదటి నుంచి న్యాయనిపుణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. స్పష్టమైన ఆధారాలున్నప్పుడు.. సీబీఐ కేసులు కొట్టి వేస్తే.. ఈడీ కేసులు ఎందుకు రద్దవుతాయని ప్రశ్నిస్తున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    విదేశాల నుంచి షెల్ కంపెనీల ద్వారా పెట్టుబడులను పెద్ద ఎత్తున తీసుకువచ్చారని సీబీఐ తేల్చింది. అలా నగదు వచ్చిన మార్గాలను కూడా తెలిపింది. దాంతో ఈడీ కేసులు నమోదు చేసి ఆస్తులు సీజ్ చేసింది. కొన్ని కేసుల్లో జగన్ సీఎం అయిన తర్వాత రిలాక్సేషన్ వచ్చింది. ఇప్పుడు.. విచారణ ప్రారంభమయ్యే పరిస్థితి ఉండటంతో వాటి విచారణను ఆపేందుకు సీబీఐ విచారణను సాకుగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ.. ఈడీ లాయర్ మాత్రం ఆ ప్రయత్నాన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్నారు. అందుకే.. ఈ కేసులు విడిగా విచారణ చేపట్టాలని పట్టుబడుతున్నారు. వీటన్నింటినీ చూస్తుంటే.. జగన్‌ ఒకవేళ సీబీఐ కేసుల నుంచి బయటపడినా.. ఈడీ మాత్రం విడిచిపెట్టేలా లేదని కనిపిస్తోంది.