దాచిపెట్టి మోసం చేశారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఓటమి భారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తట్టుకోలేకపోతున్నాడు. తనలోని ఆవేదనను, అక్కసును వెళ్లగక్కుతున్నాడు. ఈ క్రమంలోనే అమెరికా ప్రభుత్వంలోని విభాగాలు, ఫార్మా కంపెనీలపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. Also Read: ట్రంప్ ఇలా చేయడానికి కొడుకులు, అల్లుడే కారణమా..? బయో ఎన్‌ టెక్‌తో కలిసి తాము రూపొందిస్తున్న కరోనా టీకా 90 శాతం మేర సమర్థంగా పనిచేస్తోందని ఫైజర్‌‌ సంస్థ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాలు సాగుతున్నాయని వెల్లడించింది. ‘అత్యవసర వినియోగం’ […]

Written By: NARESH, Updated On : November 10, 2020 3:46 pm
Follow us on

ఓటమి భారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తట్టుకోలేకపోతున్నాడు. తనలోని ఆవేదనను, అక్కసును వెళ్లగక్కుతున్నాడు. ఈ క్రమంలోనే అమెరికా ప్రభుత్వంలోని విభాగాలు, ఫార్మా కంపెనీలపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: ట్రంప్ ఇలా చేయడానికి కొడుకులు, అల్లుడే కారణమా..?

బయో ఎన్‌ టెక్‌తో కలిసి తాము రూపొందిస్తున్న కరోనా టీకా 90 శాతం మేర సమర్థంగా పనిచేస్తోందని ఫైజర్‌‌ సంస్థ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాలు సాగుతున్నాయని వెల్లడించింది. ‘అత్యవసర వినియోగం’ కింద ఈ టీకాను అనుమతించాలని ఈ నెలాఖరులో ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసుకోనున్నట్లు చెప్పాయి. అలాగే.. ఇటీవల ట్రంప్‌ మాట్లాడుతుండగానే మీడియా లైవ్‌ను కట్‌ చేశాయి. దీంతో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా మీడియాను దూరం పెట్టాలని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ప్రధాని మీడియా సంస్థల పోల్స్‌ అన్నీ తప్పులతడకగా ఉన్నాయని ఆరోపించారు. దీంతో ఓటర్లను తప్పుదోవ పట్టించారన్నారు. ఇదంతా కుట్రలో భాగంగానే జరిగిందన్నారు.

Also Read: బైడెన్‌ తో బలపడనున్న భారత్‌–అమెరికా బంధం!

ఇవన్నింటి నేపథ్యంలో ట్రంప్ తాజాగా దుమ్మెత్తి పోశారు. కోవిడ్‌ 19 నివారణకు ఫైజర్‌‌, బయో ఎన్‌ టెక్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకా సమర్థంగా పనిచేస్తుందన్న విషయాన్ని కావాలనే ఫైజర్‌‌, అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ దాచి పెట్టాయని ఆరోపించారు. టీకా అభివృద్ధికి తాను చేసిన కృషి ఎన్నికల్లో ఉపయోగపడకుండా ఉండేందుకే ఇలా చేశారని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

కరోనా టైంలో తాను కాకుండా బైడెన్‌ అధ్యక్షుడై ఉంటే టీకా ఎప్పటికీ వచ్చి ఉండేది కాదని పేర్కొన్నారు. అలాగే.. ఎఫ్‌డీఏ సైతం ఉదాసీనంగా వ్యవహరించేదని, ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం అత్యవసర అనుమతులు ఇచ్చేదే కాదని చెప్పారు. వీరి వల్ల ప్రాణ నష్టం ఇంకా పెరిగేదని తెలిపారు. రాజకీయాల కోసం కాకుండా ప్రజల ప్రాణాలు రక్షించడానికైనా ముందు టీకా గురించి ప్రకటించాల్సి ఉండేదన్నారు.