Arattai vs WhatsApp: భారతీయులు ఏ పనైనా ఆట్టహాసంగా, ఘనంగా ప్రారంభిస్తారు. అయితే ఆ ఉత్సాహం చివరి వరకు కొనసాగించరు. మొదట్లో ఉన్న ఉత్సాహం.. క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఇదే మన దేశ అభివద్ధికి ఆటంకం. ముఖ్యంగా యువత లక్ష్యాలపై మొదట దృష్టిపెడతారు.. ఆటంకాలు ఎదురుకాగానే లక్ష్యాన్ని మార్చుకుంటారు. అస్థిరతే అసలు సమస్య. ఇందుకు తాజాగా మరో ఉదాహరణ ఆరటై్ట. ఇటీవలి కాలంలో స్వదేశీ యాప్ ఆరటై్ట వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా, దేశీ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. ఈ యాప్ మొదట్లో ప్రజలలో భారీ రావడాన్ని అందుకుంది. ‘స్వదేశీ మద్దతు‘ నినాదంతో అనేక మంది వాట్సాప్‌ను విడిచి ఆరటై్టలో చేరారు.
20 రోజుల తుఫాన్ చల్లబడింది..
ప్రారంభంలో వేగంగా వినియోగదారులు పెరిగినా, కొద్ది వారాల్లో ఆ ఉత్సాహం సాధారణ స్థాయికి చేరింది. కొత్త యాప్‌లో ఫీచర్ల కొరత, చాట్ ట్రాన్స్ఫర్ సమస్యలు, అంతర్జాతీయ కనెక్టివిటీ పరిమితులు ప్రజలను తిరిగి పాత దారికే మళ్లించాయి. ఫలితంగా, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి అంతర్జాతీయ అప్లికేషన్లు తిరిగి ప్రాధాన్యం సాధించాయి. స్వదేశీ ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడం సాంప్రదాయంగా మనలో ఉన్న గర్వకారణం. కానీ ఆ మద్దతు ఆచరణలో ఎంతకాలం నిలుస్తుందనే ప్రశ్న ఇక్కడ తలెత్తింది. ఆరంభ ఉత్సాహం సుదీర్ఘ వాడుకగా మారకపోవడం గమనార్హం.
Also Read: బీహార్ ఎన్నికల్లో ముందుగానే కాడి కింద పడేసిన రాహుల్ గాంధీ
ఏదైనా నిలబడాలంటే మద్దతు చాలా ముఖ్యం. దేశీయ యాప్‌లు నిలదొక్కుకోవాలంటే వాటి వినియోగం నిరంతరంగా కొనసాగాలి. కొత్త టెక్నాలజీలను స్వీకరించడం ఒక స్టేట్‌మెంట్‌గా కాకుండా అలవాటుగా మార్చుకోవడం ముఖ్యం. స్వదేశీ ఆవిష్కరణకు ఇచ్చే ప్రథమ స్పందన ఎంత స్థాయికి నిలుస్తుందనే అంశం భవిష్యత్ టెక్ సంస్కృతిని నిర్ణయిస్తుంది.