WhatsApp Update: నేటి కాలంలో వాట్సాప్ లోని ఫోన్ అనేది ఉన్నదంటే అతిశయోక్తి కాదు. అతిపెద్ద సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ గా వాట్సప్ అవతరించిన తర్వాత.. ప్రతి ఒక్కరూ దానిని వాడటం మొదలుపెడుతున్నారు. కొన్ని దేశాల ప్రభుత్వాలు అయితే వాట్సప్ ద్వారా ప్రజలకు సేవలు కూడా అందిస్తున్నాయి. విద్యార్థుల మార్కుల మెమోల నుంచి మొదలుపెడితే అధికారులకు ఆదేశాల వరకు ప్రతిది కూడా వాట్సప్ ద్వారానే సాగిపోతుంది.
వాట్సాప్ దాదాపు అన్ని మొబైల్లో ఇప్పుడు ఇన్ బిల్ట్ గా వస్తుంది.. వాట్సాప్ ద్వారా సందేశాల నుంచి మొదలు పెడితే వీడియోల వరకు అన్ని పంపు కోవచ్చు. ఇటీవల కాలంలో వాట్స్అప్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించింది మెటా సంస్థ. చానల్స్ నుంచి మొదలు పెడితే ఏఐ వరకు అన్ని విషయాలను, అన్ని రకాల సౌలభ్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది మెటా. దీనివల్ల ఇతర ఏ సంస్థలు కూడా వాట్సాప్ దరిదాపులోకి రాలేకపోతున్నాయి.
మంచి వెనుక చెడు ఉన్నట్టు.. వాట్సప్ ద్వారా కొన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి చెక్ పెడుతోంది మెటా. అదే కాదు కాలం చెల్లిన వెర్షన్ ఫోన్ల లో వాడే వాట్స్అప్ కు ఇకపై అప్డేట్స్ ఇవ్వడం కుదరదని మెటా స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ 6 కంటే పాత వెర్షన్లలో వాట్సప్ పనిచేయదు. ఇదే విషయాన్ని ఇటీవల WAbetal info సంస్థ ప్రకటించింది.
యాప్ ను అప్డేట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2014 కంటే ముందు విడుదలైన స్మార్ట్ ఫోన్లపై ఈ ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. యూసర్లు తమ డివైస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. అది మీరు కాకపోతే ఫోన్ మార్చాలి. దానికంటే ముందు వాట్సప్ డేటాను సేవ్ చేసుకోవడం మంచిది.
కొత్త మోడల్స్ లో వాట్సాప్ కు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తోంది మెటా. పైగా ఇప్పుడు దాదాపు అన్ని ఫోన్లలో 5జి అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ లో కొత్త అప్డేట్స్ ఇవ్వడం వల్ల యూజర్లకు మెరుగైన అనుభూతి కలుగుతుందని మెటా భావిస్తుంది. అందువల్లే పాత ఫోన్లలో అప్డేట్స్ ఇవ్వడం నిలిపివేస్తున్నట్టు మెటా ప్రకటించింది.