https://oktelugu.com/

WhatsApp: అజ్ఞాత వ్యక్తులు మేసేజ్ లు చేస్తున్నారా?, అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్..

 స్మార్ట్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిన తర్వాత.. అందులో మెసేజింగ్ ప్లాట్ ఫాం గా వాట్సప్ తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ల కంటే ఎక్కువ యూజర్లతో వాట్సప్ విశేషమైన గుర్తింపును పొందింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 28, 2024 1:17 pm
    Whatsapp Features

    Whatsapp Features

    Follow us on

    WhatsApp: మంచి వెనుక చెడు ఉన్నట్టు.. వాట్సప్ వినియోగం పెరగడంతో.. దీని ఆధారంగా అక్రమాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. కొంతమంది సైబర్ నేరగాళ్లు వాట్సప్ ద్వారా తమ చీకటి దందాలను కొనసాగిస్తున్నారు. అనేక రకాలైన మోసాలకు తెరలేపుతున్నారు. ఇందులో భాగంగానే ఇతర నెంబర్లకు అజ్ఞాత మెసేజ్ లు పంపిస్తున్నారు. ఇలాంటి మెసేజ్ లు మిగతావారికి చిరాకు కలిగిస్తుంటాయి. అయితే ఇలాంటి మెసేజ్ లకు చెక్ పెట్టడం చాలా సులభం అని చెబుతోంది వాట్సాప్. యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తామని వివరిస్తోంది..

    త్వరలో ఆ ఫీచర్

    అజ్ఞాత వ్యక్తులు పంపించే మేసేజ్ లకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ త్వరలో “black unknown account messages” అనే ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానంది. దీనివల్ల యూజర్ల ఖాతాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా గుర్తు తెలియని వ్యక్తుల ఖాతాలనుంచి వచ్చే సందేశాలను బ్లాక్ చేసేందుకు ఇది ఉపకరిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు ప్రస్తుతం దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు.. మిగతా వారికి కూడా త్వరలో అందుబాటులోకి తీసుకొస్తారు. ఇది మాత్రమే కాకుండా స్టేటస్ అప్డేట్లను లైక్ చేసే ఫీచర్ కూడా వాట్సాప్ తీసుకురానంది. ఒకవేళ ఇది అందుబాటులోకి వస్తే గుండె రూపంలోని ఏమోజితో మన స్పందన తెలియచేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తామని వాట్సప్ యాజమాన్య కంపెనీ చెబుతోంది.

    అక్రమార్కుల భరతం పట్టేందుకు..

    వాట్సప్ వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో.. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు.. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు అక్రమార్కులు వాట్సప్ ను ఉపయోగించుకుంటున్నారు. నకిలీ గుర్తింపు కార్డుల మీదుగా సిమ్ లు కొనుగోలు చేసి.. వాటి ద్వారా వాట్సప్ ఉపయోగిస్తున్నారు. అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు దండుకుంటున్నారు. ఆ తర్వాత ఆ సిమ్ ను వాడకుండా పడేస్తున్నారు. అయితే ఇలాంటి వ్యక్తుల దుర్మార్గాలకు చెక్ పెట్టేందుకు వాట్సప్ ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది..

    త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో..

    ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో వచ్చే రోజుల్లో మరిన్ని సదుపాయాలను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని వాట్సప్ యాజమాన్య కంపెనీ చెబుతోంది. యూజర్ల భద్రత, వ్యక్తిగత గోప్యత వంటి వాటికి తాము ప్రధమ ప్రాధాన్యం ఇస్తామని అంటున్నది. అందువల్లే సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నామని చెబుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్ గా వాట్సాప్ అవతరించిన నేపథ్యంలో.. మరింత మంది యూజర్లను పెంచుకునేందుకు ఇంకా సరికొత్త ఫీచర్లను తీసుకొస్తామని వాట్సాప్ యాజమాన్య కంపెనీ చెబుతున్నది.