Dulip trophy 2024 : దులీప్ ట్రోఫీ నుంచి సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, రవీంద్ర జడేజా ఔట్.. కారణం ఇదే..

టీమిండియా ను ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ విజేతగా నిలపాలని బీసీసీఐ పెద్దలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా అనేక ప్రణాళికలు రూపొందించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 28, 2024 1:17 pm

Dulip trophy 2024

Follow us on

Dulip trophy 2024 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో గెలవాలంటే టీమిండియా కచ్చితంగా ఐసీసీ టెస్ట్ క్రికెట్ లో పాయింట్ల మొదటి రెండు స్థానాల్లో ఉండాలి. అలా జరగాలంటే ఎదురయ్యే ప్రతి టెస్ట్ సిరీస్ లో భారత్ గెలవాలి. వచ్చే నెలలో టీమిండియా బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడుతుంది. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా తో తలపడుతుంది. ఈ సిరీస్ లో ఏకంగా ఐదు టెస్ట్ మ్యాచ్ లు భారత్ ఆడుతుంది.. ఈ క్రమంలోనే టెస్ట్ క్రికెట్ ఆడే జట్టును బలోపేతం చేసేందుకు బీసీసీఐ అనే కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే తెరపైకి దేశవాళి క్రికెట్ టోర్నీని తీసుకొచ్చింది. ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా మినహా మిగతా వారందరూ ఆడాలని షరతు విధించింది. త్వరలో ప్రారంభమయ్యే దేశవాళీ దులీప్ ట్రోఫీలో అందరూ ఆడాలని స్పష్టం చేసింది. గతానికంటే భిన్నంగా ఈసారి ఏకంగా నాలుగు జట్లను ఎంపిక చేసింది. ఆ నాలుగు జట్లకు జాతీయ జట్టులో ఆడుతున్న ఆటగాళ్లను కెప్టెన్లుగా నియమించింది. ఈ ట్రోఫీలో ప్రతిభ చూపిన ఆటగాళ్లకే అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేసింది. ఈ జట్లను గతంలోనే నియమించింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్ణాటకలోని బెంగళూరులో దులీప్ ట్రోఫీని నిర్వహించనుంది.

తప్పుకున్న కీలక ఆటగాళ్లు

ఈ టోర్నీ ప్రారంభానికి ముందే సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, రవీంద్ర జడేజా తప్పుకున్నారు. నవదీప్ షైనీ, గౌరవ్ యాదవ్ అనే ఆటగాళ్లు కూడా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కొంతకాలంగా గౌరవ్ ఆడుతున్నాడు. గత రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, మాలిక్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో వారికి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. తొలి రౌండ్ లో వారికి ఆడే అవకాశం ఉండదు. తదుపరి రౌండులో వారు తమ జట్లలోకి ఎంట్రీ ఇస్తారు. వచ్చే నెలలో దులీప్ ప్రొసీడ్ మొదలవుతుంది. గతంలో జోనల్ విధానంలో దులీప్ ట్రోఫీ నిర్వహించారు. ఈసారి ఆ విధానాన్ని రద్దు చేస్తూ ఇండియా ఏ, ఇండియా బి, ఇండియా సి, ఇండియా డి అనే పేరుతో జట్లను ఏర్పాటు చేశారు.. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలోని క్రికెట్ గ్రౌండ్ కాంప్లెక్స్ లో రెండు వేదికలలో దులీప్ ట్రోఫీ సాగుతుంది. బెంగళూరులోనూ కొన్ని మ్యాచులు నిర్వహిస్తారు.. సెప్టెంబర్ ఐదున ప్రారంభ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది.. సెప్టెంబర్ ఐదు నుంచి 8 దాకా ఇండియా ఏ, ఇండియా బి జట్లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తలపడతాయి. సెప్టెంబర్ ఐదు నుంచి 8 దాకా ఇండియా – సి, ఇండియా – డీ జట్టు అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియంలో పోటీ పడతాయి. సెప్టెంబర్ 12 నుంచి 15 వరకు ఇండియా ఏ, ఇండియా డీ జట్లు అనంతపురం జిల్లాలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియంలో పరస్పరం పోటీ పడతాయి. సెప్టెంబర్ 12 నుంచి 15 వరకు ఇండియా బి, ఇండియా సీ జట్లు అనంతపురంలో తలపడతాయి. సెప్టెంబర్ 19 నుంచి 22 వరకు ఇండియా ఏ, ఇండియా సీ జట్లు అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియంలో తలపడతాయి. సెప్టెంబర్ 19 నుంచి 22 వరకు ఇండియా బీ, ఇండియా డీ జట్లు అనంతపురం మైదానంలో పోటీ పడతాయి. ఇండియా ఏ జట్టుకు గిల్, బీ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్, సీ జట్టుకు రుతు రాజ్ గైక్వాడ్, డీ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లు గా వ్యవహరిస్తున్నారు.