WhatsApp APK Scam: కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి.. సుఖాలు అనుభవించాలి.. సౌకర్యాలు సొంతం చేసుకోవాలి.. సౌఖ్యాలను అందిపుచ్చుకోవాలి.. నేటి కాలంలో మెజారిటీ మనుషుల మనస్తత్వం ఇలానే ఉంది. కష్టపడకుండా డబ్బు సంపాదించడానికి ఎదుటివాడిని ఏం చేసినా పర్వాలేదు అనే స్థాయికి నేటి సమాజం దిగజారింది. మోసం చేయడమే కాదు చివరికి అంతం చేయడానికి కూడా వెనకాడడం లేదు. డబ్బు అన్ని సమస్యలకు పరిష్కార మార్గం కావడంతో.. దానిని సంపాదించడానికి ఎన్ని అడ్డదారులు తొక్కడానికైనా వెనుకంజ వేయడం లేదు.
Also Read: భారత్ లోకి ఈ ఫోన్ గనుక వస్తే సంచలనమే..జియో, ఎయిర్ టెల్ బ్యాగ్ సర్దేసుకోవడం పక్కా!
నేటి స్మార్ట్ కాలంలో మోసాలు ఘోరంగా జరుగుతున్నాయి. ముందుగా చెప్పినట్టు డబ్బు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కడానికైనా కొంతమంది సిద్ధంగా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే వారు అవతారాలు మార్చుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే వైట్ కాలర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఎక్కడో సుదూర ప్రాంతాలలో తల దాచుకొని.. రకరకాల అక్రమ మార్గాల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. తమ డబ్బు సంపాదనకు ఆన్లైన్ వ్యవస్థను వాడుకుంటున్నారు. నేటి కాలంలో ప్రతిదీ ఆన్లైన్ ద్వారా జరుగుతున్న నేపథ్యంలో వైట్ కాలర్ మోసగాళ్లకు వరంగా మారింది. వాట్సాప్, మెసేజ్, ఇతర సామాజిక మాధ్యమాలలో లింకులు పంపించడం.. వాటిని ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ అయిపోవడం వంటి దారుణాలకు వైట్ కాలర్ మోసగాళ్లు పాల్పడుతున్నారు. తాజాగా ఇటువంటి అనుభవం కృష్ణాజిల్లా కంకిపాడు చెందిన ఎరువుల దుకాణ డీలర్ రాంబాబుకు ఎదురయింది. వాట్సాప్ లో అతనికి వచ్చిన ఈ చాలన్ పిడిఎఫ్ ఏపీకే ఫైల్ అతడు తెరవడమే పాపమైంది.
Also Read: ఏ టెక్నాలజీ వచ్చినా.. భారతీయులే ముందు.. తగ్గేదేలే
కృష్ణాజిల్లా కంకిపాడు చెందిన రాంబాబు ఎరువుల దుకాణ డీలర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎరువుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎరువుల డీలర్ల గ్రూపులో వచ్చిన ఈ చలాన్ పిడిఎఫ్ ఏపీకే ఫైల్ తెరిచాడు. అంతే క్షణాల్లోనే ఫోన్ విపరీతంగా వేడెక్కింది. చూస్తుండగానే విడతల వారీగా 70 వేల నగదు లూటీ అయింది. వెంటనే ఆ ఖాతా ఉన్న బ్యాంకు వద్దకు వెళ్లి తన ఖాతాను నిలుపుదల చేయించాడు. బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులకు విషయాన్ని తెలిపాడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు..” ఎరువుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మా గ్రూపులో లావాదేవీలకు సంబంధించి చర్చలు జరుగుతుంటాయి. ఏపీకే ఫార్మేట్ లో వచ్చిన ఒక చలాన్ నేను చూశాను. ఎందుకైనా మంచిదని ఓపెన్ చేశాను. అది ఆ పాలిట ఇబ్బందికరంగా మారింది.. అది ఓపెన్ చేయగానే ఫోన్ విపరీతంగా వేడెక్కింది. నా ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం బదిలీ అయ్యాయి.. వెంటనే భయంతో సంబంధిత బ్యాంకు దగ్గరికి వెళ్లాను. నా ఖాతాను నిలుపుదల చేయించాను. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పాను. వారు నా దగ్గర నుంచి ఆధారాలు తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారని” రాంబాబు వెల్లడించాడు.