Indians Lead In Technology: శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయమైన మార్పు చోటుచేసుకుంటున్నది. ఒకప్పుడు గొప్పగా వెలుగొందిన సాంకేతికత ఇప్పుడు పాదయిపోయింది. ఇప్పటి అవసరాలు మాత్రమే కాకుండా, భవిష్యత్తు లక్ష్యాలను కూడా సాధించగలిగే సాంకేతికతకే డిమాండ్ ఏర్పడుతోంది.
భవిష్యత్తు లక్ష్యాలను సాధించగలిగే సాంకేతికతను ప్రస్తుతం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయగా వెలుగులోకి వచ్చిన సాంకేతికత పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని ద్వారా ఇప్పుడు మనిషి జీవితం సరికొత్త మార్పులకు గురవుతోంది. మనిషి ఆధారపడే రంగాలలో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది.. ఇది ఎక్కడిదాకా వెళ్తుంది.. ఇంకా ఎన్ని అద్భుతాలను కళ్ళముందు తీసుకొస్తుంది అనే విషయాలను పక్కన పెడితే.. ఇప్పటివరకు అయితే అన్ని రంగాలను ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ శాసిస్తోంది. ఒకప్పుడు అనేక విభాగాలకు సాంకేతిక నిపుణుల అవసరం ఉండేది. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత వారి అవసరం లేకుండానే పనులు మొత్తం జరిగిపోతున్నాయి. వందమంది చేసే పని ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా సులువుగా సాగిపోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెరపైకి రావడం వల్ల ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేక కుదుపులకు గురవుతోంది. ఇప్పటికే వేలాదిమంది తన ఉద్యోగాలను కోల్పోయారు. కోల్పోతూనే ఉన్నారు. అయినప్పటికీ దిగజా ఐటీ సంస్థలు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను అనుసంధానించడంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. పైగా సర్వీస్, టెక్నాలజీ, ప్రొడక్షన్ వంటి విభాగాలలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం మరింతగా పెరిగిపోయింది. ఫలితంగా ఈ విభాగాలలో ఉద్యోగుల కోత అనివార్యమైపోయింది. ఇప్పటికే లక్షలాదిమంది ఉద్యోగులు తమ కొలువులు పోయాయని బాధపడుతున్నప్పటికీ.. వారి మొర ఆలకించేవారు లేకపోయారు.
Also Read: Technology: టెక్నాలజీ తిరిగి వచ్చిన వేల సంవత్సరాల క్రితం అంతరించిన తోడేళ్లు..ఎలాగంటే?
తాజా నివేదికలో..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి తాజా నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వచ్చే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పనిచేయడానికి భారీగా నిపుణుల అవసరం పెరుగుతుందని తెలుస్తోంది. అయితే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆ స్థాయిలో నిపుణులు అమెరికా నుంచి ఉద్భవిస్తారని.. ఆ తర్వాత స్థానం భారత్ ఆక్రమిస్తుందని తెలుస్తోంది.. అన్న విభాగాలలోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అనివార్యం అయిపోయిన నేపథ్యంలో భవిష్యత్ కాలంలో ఆ విభాగంలో పనిచేసే నిపుణులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిపుణులను తయారు చేయడంలో అమెరికా ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తే.. భారత్ రెండో స్థానాన్ని ఆక్రమిస్తుందని తెలుస్తోంది..” భారత దేశంలో ఐటీ ఆదారిత కార్యకలాపాలు గతంతో పోల్చి చూస్తే పెరిగిపోయాయి. ఒకరకంగా వెస్ట్రన్ కంట్రీస్ కు అత్యంత చవక ధరలో ఉత్పత్తులను భారత కంపెనీలు అందిస్తున్నాయి. ప్రపంచం మొత్తం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతుంటే.. భారత్ లోనూ కంపెనీలు దానిని అందిపుచ్చుకున్నాయి. ఒక రకంగా అమెరికా కంపెనీలకు కూడా సవాల్ విసురుతున్నాయి. సాంకేతికత విషయంలో అమెరికా కంపెనీలు ముందు వరుసలో ఉన్నప్పటికీ.. అక్కడ నిపుణులు ఎక్కువగా తయారవుతున్నప్పటికీ.. భారత్ అమెరికా తర్వాత స్థానాన్ని ఆక్రమిస్తుందని” అంతర్జాతీయ నివేదికలు తేటతెల్లన చేస్తున్నాయి. భవిష్యత్తు కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో 12 లక్షల మంది నిపుణుల అవసరం పడుతుందని.. అందులో పావువంతుకు మించిన వాటా భారత్ సొంతం చేసుకుంటుందని ఐటీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.