WhatsApp: ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ను కోట్లాది మంది వినియోగిస్తున్నారు. అయితే సోమవారం రాత్రి నుంచి పలువురు యూజర్లకు ఊహించని సమస్య ఎదురైంది. భారత్‌తో పాటు పలు దేశాల్లోని కొంతమంది యూజర్ల అకౌంట్లు ‘అకౌండ్ అండర్ రివ్యూ’ స్థితిలోకి వెళ్లాయి. దీంతో వారికి మెసేజింగ్, కాలింగ్ వంటి ప్రధాన ఫీచర్లు తాత్కాలికంగా అందుబాటులో లేకుండా పోయాయి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే?
ఈ సమస్య ఎదురైన వారికి వాట్సాప్ మీ అకౌంట్‌ను సమీక్షిస్తున్నాం… ఈ ప్రక్రియకు 24 గంటల వరకు పట్టవచ్చు.. అనే మెసేజ్ వచ్చినట్లు కొందరు సోషల్ మీడియా వ్యాప్తంగా పోస్టులు పెడుతున్నారు. అయితే కొందరి అకౌంట్లు మాత్రం కొన్ని గంటల్లోనే తిరిగి యాక్టివ్ అయినట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి.
వాట్యాప్ అకౌంట్లు ఇలా ఎందుకు రివ్యూకు వెళ్లాయనే విషయంపై కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ పెద్ద సంఖ్యలో అకౌంట్లు ఇలా ఒకేసారి ఆగిపోవడంతో.. ఇది సాంకేతిక లోపం లేదా ఆటోమేటెడ్ సెక్యూురిటీ పరిశీలనలో భాగం అయి ఉండొచ్చని అంటున్నారు. కంపెనీ మాత్రం పనిచేయని అకౌంట్లకు వీలైనంత త్వరగా తిరిగి యాక్సెస్ కల్పించే చర్యలు చేపట్టినట్లు కంపెనీ వెల్లడించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో చాలా మంది యూజర్ల అకౌంట్లు దశలవారీగా సాధారణ స్థితికి వస్తున్నట్లు సమాచారం.
ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందుగా 24 గంటల వరకు వేచి చూడాలి. అకౌంట్‌లో ‘రిక్వెస్ట్ రివ్యూ’ అనే ఆప్షన్ కనిపిస్తే దాన్ని ఉపయోగించాలి. అదే సమయంలో అధికారిక వాట్సాప్ యాప్ మాత్రమే ఉపయోగించాలి. అలాగే ఒకేసారి పలుమార్లు లాగిన్ ప్రయత్నాలు చేయడం లేదా యాప్‌ను పదేపదే అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేయడం మానుకోవడం మంచిది.