Best features in Whatsapp: నేటి కాలంలో మొబైల్ ఉన్న వారు Whatsapp వాడకుండా ఉండరు. ఎందుకంటే చిన్న మెసెజ్ నుంచి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వరకు అన్నీ వాట్సాప్ లోనే పంపించుకోవచ్చు. మనీ ట్రాన్స్ ఫర్ కూడా వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే వినియోగదారుల అవసరాలను గుర్తించిన మెటా సంస్థ ఎప్పటికప్పుడ ఈ యాప్ ను అభివృద్ధి చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా కొన్ని రకాల యూజ్ ఫుల్ ఆప్షన్లను కూడా ఉంచింది. వీటి ద్వారా యూజర్స్ క ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మూడు ఆప్షన్లు ఎంతో మందికి ఉపయోగపడే అవకాశం ఉంది. మరి ఆ మూడింటి గురించి తెలుసుకుందామా..?
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏవైనా డాక్యుమెంట్స్ పంపించాలంటే ఆన్ లైన్ లోనే సెండ్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి వందల కొద్దీ పేపర్స్ ఒకేసారి పంపించాల్సి వస్తుంది. వీటిని ఒక్కో ఇమేజ్ పంపిచడానికి కష్టం అవుతుంది. అయితే వీటిని పీడీఎఫ్ చేసి ఒకే ఫైల్ లో సెండ్ చేయవచ్చు. ఇమేజ్ ఫైల్స్ ను పీడీఎఫ్ క్రియేట్ చేయడానికి సమయం తీసుకుంటుంది. కానీ ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా వాట్సాప్ లోకి వెళ్లాలి. ఈ ఫైల్ ను ఎవరికైతే పంపించాలని అనుకుంటున్నారో.. వారి ట్యాబ్ ఓపెన్ చేయాలి. ఇప్పడు మెసేజ్ బాక్స్ వద్ద + అనే సింబల్ కనిపిస్తుంది. దీనిని ప్రెస్ చేయగానే.. డాక్యుమెంట్ ఆప్షన్ కనిపిస్తంది. దీనిపై ప్రెస్ చేయగానే Scan అనే మరో ఆప్షన్ చూపిస్తుంది. అప్పుడు మీకు కావాల్సిన డాక్యమెంట్స్ పై చూపిస్తే ఆటోమేటిక్ గా స్కాన్ చేసుకొని పీడీఎఫ్ గా మార్చుకుంటుంది.
కొందరు పర్సనల్ వ్యక్తులు పంపించే ఆడియోలను అందరి మందు వినే అవకాశం ఉండదు. అయితే ఏదైనా ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నప్పుడు ఇది అస్సలు సాధ్యం కాదు. ఇలాంటి సమయంలో ఆడియోను టెక్స్ట్ గా మార్చుకొని అతడు ఏం పంపించాడో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందగా Settingsలోకి వెళ్లాలి. ఆ తరువాత chatsపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు Voice message transcriptionఅనే అప్షన్ కనిపిస్తుంది. దీనిని ఆన్ చేసకోవాలి. దీనిని ఆ ఆడియోను టెక్ట్స్ రూపంలో చూడొచ్చ.
వాట్సాప్ లో కొన్ని సీక్రెట్ చాట్స్ ఉంటాయి. ఆ నెంబర్ కలిగిన వారిని సెలెక్ట్ చేసుకొని Lock Chat పై క్లిక్ చేయాలి. ఇప్పడు సెట్టింగ్స్ పై క్లిక్ చేసిన తరువాత Hide locked chats అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏదైనా సీక్రెట్ కోడ్స్ పెట్టుకోవాలి. ఆ తరువాత చాట్స్ లోకి వెళ్లి సీక్రెట్ కోడ్స్ ఎంట్రీ చేస్తే తప్ప ఆ చాట్ ఓపెన్ కాదు. ఈ ఆప్షన్ల వల్ల కొంత మందికి చాలా రకాలుగా ఉపయోగపడుతాయి.