Smartphones: ఆధునిక కాలంలో ఫోన్లు వాడకం పెరుగుతోంది. ప్రతి వారి చేతిలో స్మార్ట్ ఫోన్లు విరివిగా వాడుతున్నారు. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. అయినా వారిలో మార్పు రావడం లేదు. ఇరవై నాలుగు గంటలు ఫోన్లకే పరిమితమైపోతున్నారు. వేరే ప్రపంచం లేదు. ఫోన్లతోనే కాలం గడుపుతున్నారు. ఫలితంగా పలు రోగాలకు దగ్గరవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఫోన్ల వాడకం ఎక్కువవుతోంది. సెల్ కు బానసలుగా మారుతున్నారు. సెల్ లేనిదే బతకలేమని చెబుతున్నారు.

మొబైళ్లు వాడకంతో అబ్బాయిలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. సంతానలేమితో సమస్యలమయం అవుతున్నారు. మొబైల్ వాడకంతోనే అందరు బాధపడుతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అబ్బాయిలు మొబైల్ వాకడం వల్ల రేడియేషన్ కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతోంది. మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావంతో ఇంకా ఎన్నో ఇబ్బందులు రావడం గమనార్హం. మొబైల్ ఉపయోగంతో చాలా జంటల్లో సంతాన లేమి సమస్య బాధిస్తోంది.
ఎలక్ర్టానిక్ వస్తువులను అధికంగా ఉపయోగించడంతో సంతాన లేమి ఇబ్బందులకు గురిచేస్తోంది. రేడియేషన్ కారణంగా చాలా మందికి పిల్లలు పుట్టే యోగం కలగడం లేదు. ఇంకా మానసిక ఒత్తిడి పెరగడం మూలంగా కూడా పురుషుల్లో సంతాన లేమి సమస్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 23 శాతం మంది అబ్బాయిలు ఫెర్టిలిటీ సమస్యతో సతమతమవుతున్నారు. మొబైల్ ఫోన్లు వాడకం తగ్గించాలని ఎంత చెప్పినా పెడచెవిన పెడుతున్నారు.

మొబైల్ ఫోన్ల వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని తెలిసినా ఎవరు కూడా స్పందించడం లేదు. ఈ క్రమంలో మొబైళ్ల వాడకంతో తిప్పలు వస్తున్నాయని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇరవై నాలుగు గంటలు ఫోన్లతో గడుపుతున్నారు. దీంతో భవిష్యత్ ను అంధకారం చేసుకుంటున్నారు. మొబైళ్ల వాడకంపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. వీటితో కలిగే అనర్థాలతో ఇంకా ముప్పు ఎక్కువగా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయినా మనవారు ఫోన్లు విడిచిపెట్టడం లేదు.