T20 Cricket World Cup 2022: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ నెల 23న ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య మెల్ బోర్న్ వేదికగా మ్యాచ్ జరగనుంది. దీనికి అభిమానులు ఎంతో ఆశతో ఉన్నారు. మ్యాచ్ అంటే ఇండియా, పాక్ జట్ల మధ్య ఉంటేనే ఆ మజా వస్తుంది. దీనికి ఇరు దేశాల అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నా వరుణుడు వారి ఆశలపై నీళ్లు జల్లే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని ఇరు జట్లు శ్రమిస్తున్నాయి. అందుకోసం కసరత్తులు ముమ్మరం చేశాయి. వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి.

పాకిస్తాన్ ను కట్టడి చేసే జట్టు కోసం టీం మేనేజ్ మెంట్ ప్రయత్నిస్తోంది. సమర్థులైన ఆటగాళ్లను ఎంపిక చేస్తోంది. పటిష్ట జట్టుతో బరిలోకి దిగితే ఫలితం వస్తుందని భావించి బీసీసీఐ ఈ మేరకు జట్టుకు తుది రూపు కల్పించింది. రోహిత్ శర్మకు ఇదే మొదటి ప్రపంచ కప్ కావడంతో సత్తా చాటాలని భావిస్తున్నాడు. యువ ఆటగాళ్లతో జట్టు పూర్తిస్థాయిలో పటిష్టంగా కనిపిస్తోంది. ఇక పాక్ ను మట్టి కరిపించడమే ధ్యేయంగా ముందుకు కదలనుంది. కసరత్తు చేసి ఆటగాళ్లలో ఆత్మస్థైర్యం నింపుతోంది.
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండాలని మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ భావించాడు. అర్ష్ దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమిలకు సైతం చోటు దక్కాలని ఆశిస్తున్నాడు. దీపక్ హుడా, రవిచందర్ అశ్విన్, హర్షల్ పటేల్ లకు తుది జట్టులో అవకాశం రాదని అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మాట్ లో అశ్విన్ పై ఆధారపడటం కష్టమే. రిషబ్ పంత్ ను కాదని దినేష్ కార్తీక్ కు భజ్జీ ఆసక్తి చూపడం తెలిసిందే.

చిరకాల ప్రత్యర్థుల పోరుకు రంగం సిద్ధమైంది. ఇందులో ఐదుగురు బ్యాటర్లు, ఒక ఆల్ రౌండర్, ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో టీమిండియా బరిలోకి దిగుతోంది. బస్ ప్రీత్ బుమ్రా గైర్హాజరైన నేపథ్యంలో మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమి బాధ్యత అని భావిస్తున్నారు. దీంతో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎలా సాగుతుందోననే ఆతృత అందరిలో నెలకొంది. ఇరు జట్లు ఎలాగైనా బోణీ కొట్టాలని చూస్తున్నాయి. దీంతో ప్రపంచ కప్ లో సత్తా చాటాలని ఆలోచిస్తున్నాయి. అందుకోసమే అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాయి.
టీమిండియా జట్టులో రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్థిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర రహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, మహ్మద్ షమి లు ఉన్నారు.