Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీసన్ 6 ప్రారంభమై ఇప్పటికే ఆరు వారాలు పూర్తి అయ్యి 7 వ వారం లోకి అడుగుపెట్టింది..ఇక ఈ 7 వ వారం లో హౌస్ మేట్స్ బోగ్ బాస్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ టాస్కుని సరిగా ఆడకపోవడం తో ఇంట్లో ఉన్న ఫుడ్ మొత్తాన్ని దొంగలించి..ఇక నుండి ఇంట్లో ఎవరైనా తిండి తినాలంటే పోరాడాల్సిందే అంటూ కటిమానైనా టాస్కులు ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసింది బిగ్ బాస్ టీం.
ఇది ఇలా ఉండగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు..శాశ్వత మిత్రులు ఉండరు అనేది ఎంత నిజమో..బిగ్ బాస్ లో కూడా ఉన్న వంద రోజుల్లో ఈరోజు మిత్రుడుగా ఉన్నవాడు రేపు మిత్రుడుగా ఉంటాడా అనేది గ్యారంటీ ఇవ్వలేము..అలాగే హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి గొడవలు పడుతూ ఉండే కంటెస్టెంట్స్ అకస్మాత్తుగా స్నేహితులు అయిపోవచ్చు..అలాంటి సందర్భాలు గత సీసన్స్ లో మనం ఎన్నో చూసాము..ఈ సీసన్ లో కూడా అలాంటి సందర్భం ఇప్పుడు చోటు చేసుకుంది.
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి తరుచు ఎదో ఒక విషయం లో గొడవలు పడుతూ వస్తున్నా శ్రీహాన్ మరియు ఇనాయ సుల్తానా ఇప్పుడు మంచి స్నేహితులుగా మారిపోవడం అందరిని షాక్ కి గురి చేస్తుంది..ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు శ్రీహాన్ పుట్టిన రోజు సందర్భంగా బిగ్ బాస్ అతని కోసం ప్రత్యేకమైన కేక్ ని ఏర్పాటు చేసాడు..అయితే ఆ కేక్ మీద శ్రీహాన్ అని రాయబోతుంటే, ఇనాయ సుల్తానా శ్రీహన్ అని ఒద్దు..చోటు అని రాయండి అని చెప్తుంది..అంతే కాకుండా అక్కడ ఇంట్లో ఉన్నవాళ్ళందరి కంటే శ్రీహన్ పుట్టిన రోజు కి ఇనాయ హంగామానే ఎక్కువ అయిపోయింది.
ముందు రోజు కూడా శ్రీహాన్ ఇనాయ తో మాట్లాడుతూ ‘నువ్వు హౌస్ లో అందరికంటే బెస్ట్..కానీ నువ్వు నన్ను నామినేట్ చేసావు అనే కోపం తోనే నేను నిన్ను నామినేట్ చేశాను తప్ప..నీ మీద నాకు చెడు అభిప్రాయం ఉందని కాదు’ అంటూ శ్రీహన్ మొట్టమొదటిసారి ఇనాయ తో కూల్ గా మాట్లాడడం తో వీళ్లిద్దరి మధ్య సఖ్యత ఏర్పడింది..మరి ఈ సఖ్యత హౌస్ లో ఉన్నన్ని రోజులు ఉంటుందా..లేదా బిగ్ బాస్ మధ్యలో ఏమైనా ఫిట్టింగులు పెడుతాడా అనేది చూడాలి.