spot_img
Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీSmart TVs: పదివేలకే పెద్ద స్మార్ట్ టీవీలు.. ఎక్కడంటే?

Smart TVs: పదివేలకే పెద్ద స్మార్ట్ టీవీలు.. ఎక్కడంటే?

Smart TVs: ఒకప్పుడంటే మామూలు బ్లాక్ అండ్ టీవీలు ఇంట్లో ఉండేవి. కలర్ టీవీ ఉంటే గొప్పగా చూసేవారు. ఆ తర్వాత సాంకేతిక పరిజ్ఞానం మారింది. టీవీల పరిమాణంలోనూ మార్పు చోటుచేసుకుంది. పెద్ద టీవీలు కాస్త స్మార్ట్ గా మారాయి. ఇప్పుడు 4K, Dolby, smart గా రూపాంతరం చెందాయి. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో తెలియదు కాని.. ఇప్పటికైతే మార్కెట్ ను స్మార్ట్ టీవీలు ముంచెత్తుతున్నాయి. ఈ స్మార్ట్ టీవీల తయారీలోనూ కొత్త కొత్త కంపెనీలు వస్తుండటంతో పోటీ పెరిగింది. దీంతో ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.

ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్(Flipkart) సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. మెగా బోనాంజా సేల్ పేరుతో అమ్మకాలు కొనసాగిస్తోంది.. ఇందులో రకరకాల స్మార్ట్ టీవీ డీల్స్ ను తెరపైకి తెచ్చింది. అయితే వీటిలో 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి 7వేల నుంచి పదివేల బడ్జెట్ లో లభిస్తున్నాయి. ముఖ్యంగా పేదలు, దిగువ మధ్యతరగతి వారికి ఈ ఆఫర్లు వరమే అని చెప్పాలి.. స్మార్ట్ టీవీ విభాగంలో ఈ మూడు డీల్స్ ది బెస్ట్ అని ఫ్లిప్ కార్ట్ చెబుతోంది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన మెగా బోనాంజా సేల్ జూన్ 13 నుంచి మొదలైంది. జూన్ 19 అంటే నేటితో ముగుస్తుంది.

Cooca 32 in smart TV..
Offer price:₹ 7,999

కూకా బ్రాండ్ కంపెనీకి చెందిన 32 ఇంచుల స్మార్ట్ టీవీ ని ₹7,999 కే అందిస్తోంది.. ఈ టీవీ మోడల్ నెంబర్ 32S3U – pro.. దీనిని 78% డిస్కౌంట్ తో ₹7,999 కే విక్రయిస్తోంది ఫ్లిప్ కార్డ్. పైగా దీనిపై బ్యాంకు ఆఫర్స్ కూడా ఉన్నాయి.. Dolby audio ను ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. ఇన్ బిల్ట్ Wi-Fi, HDMI, USB, 400 nits brightness screen వంటి సౌలభ్యాలు ఈ టీవీలో ఉన్నాయి.

Thomson Alpha: 32 inches smart TV.. offer price ₹8,499

థామ్సన్ కంపెనీకి చెందిన ఈ టీవీ లైనెక్స్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. దీనిపై 43% డిస్కౌంట్, 10% బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది.. Wi-Fi, HDMI, USB ని సపోర్ట్ చేస్తుంది. సరౌండ్ సపోర్ట్ సాలభ్యం ఉన్న 30 వాట్స్ బాక్స్ స్పీకర్ లు ఈ టీవీకి ఉన్న ప్రధాన ఆకర్షణ.

i FFALCON 32 inches smart TV: offer price ₹9,999

ఐ ఫాల్కన్ కంపెనీ చెందిన ఈ స్మార్ట్ టీవీ పై 49% డిస్కౌంట్ లభిస్తోంది. ఫలితంగా ఇది ₹9,999 కే లభ్యమవుతోంది. దీనిపై HDFC, ICICI కార్డ్స్ పై 10 శాతం బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. HDR 10, inbuilt Wi-Fi, HDMI, USB సపోర్ట్ ఈ టీవీ కి లభిస్తుంది. Dolby audio sound ఈ టీవీ కి ఉన్న అదనపు ఆకర్షణ.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper